Home /News /trending /

WOMAN HURLS CHAPPALS AT SACKED BENGAL MINISTER PARTHA CHATTERJEE OUTSIDE ECI HOSPITAL PAH

Shocking: ఆగ్రహంతో ఊగిపోయి.. మంత్రిపై చెప్పు విసిరిన మహిళ.. ఎందుకంటే..

ఆగ్రహంతో నిరసన తెలుపుతున్న మహిళ

ఆగ్రహంతో నిరసన తెలుపుతున్న మహిళ

West bengal: వెస్ట్ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ కోసం తీసుకెళ్లినప్పుడు ఒక మహిళ మంత్రిపై చెప్పును విసిరింది.

కొందరు అధికారులు, మంత్రులు తమ అధికారాన్ని, హోదాలను అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తుంటారు. మరికొందరు.. అనేక రకాల స్కామ్ లకు పాల్పడుతుంటారు. అమాయక ప్రజలను మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటారు. దీంతో కొందరిని ఈడీ, సీబీఐ అధికారులు వలపన్ని పట్టుకుంటారు. అయిన.. ఇప్పటికి అనేక మంది పొలిటియన్ లు, అధికారులు అడ్డంగా దొరికి పోయిన అనేక సంఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటునే ఉంటాయి. వీరిని ప్రజలు తమదైన రీతిలో నిరసన తెలియజేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. వెస్ట్ బెంగాలో (West bengal) వెలుగులోనికి వచ్చిన మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) స్కామ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయనను పదవిలో నుంచి తొలగించారు. ఆయనను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, మంత్రి పార్థ ఛటర్జీ.. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కోట్లాది రూపాయల వెనుకేసుకున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఆయనను ఈడీ ఆఫీస్ కు విచారణకు తీసుకెళ్తుండగా, ఈఎస్ఐ ఆస్పత్రిలో టెస్ట్ ల కోసం తీసుకెళ్లారు. ఆస్పత్రి బయట.. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి తమ నిరసనను తెలిపారు.





అంతేకాకుండా.. ఒక మహిళ పార్థ ఛటర్జీపై ఏకంగా తన చెప్పును విసిరింది. మంత్రిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆయనపై విమర్శలు చేశారు.. "తాను మంత్రిపై నా షూ విసిరేందుకు వచ్చానని చెప్పింది. అతను అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడని తెలిపింది. అతని తలపై షూ తగిలి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని ”ఆమె చెప్పింది. అయితే.. ఈడీ అధికారులకు మంత్రి పార్థఛటర్జీ సరిగ్గా సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. తాము.. ప్రశ్నలడిగితే.. దాటవేస్తున్నాడని, అలిసిపోయినట్లు చేస్తున్నాడని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Enforcement Directorate, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు