Home /News /trending /

WOMAN HAS HAD 23 JOBS AT THE AGE OF 23 SAYS SHE WAS A TERRIBLE EMPLOYEE BUT NEVER GOT FIRED GOES VIRAL PAH

ట్యాలెంట్ అంటే ఇది.. 23 ఏళ్ల వయసులో.. 23 ఉద్యోగాలు చేసిన యువతి.. చివరకు పెద్ద కంపెనీకి..

అనస్తాసియా సెచెట్టో (ఫైల్)

అనస్తాసియా సెచెట్టో (ఫైల్)

London: యువతి ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 23 వేర్వేరు ఉద్యోగాలను చేసింది. తనకు ఏమాత్రం సంబంధంలేని రంగంలో ఉద్యోగాలు చేసి తన కంటూ మంచి పేరు సంపాదించింది.

కొందరు ఒక ఉద్యోగం వెతుక్కొవడానికి తలకిందులుగా తపస్సు చేసినట్లు ఫీల్ అవుతారు. ఏ ఒక్క ఉద్యోగంలోను తమ ప్రతిభను కనబర్చరు. కానీ కొందరు దీనికి భిన్నంగా ఉంటారు. ఎప్పుుడు కష్టపడుతునే ఉంటారు. ఏదైన మంచి ఉద్యోగం సాధించాలనే తపన వీరిలో ఎప్పుడు ఉంటుంది. తమకు కావాల్సిన ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతునే ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తునే.. మరోక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి రాజీపడరు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో (Trending news)  నిలిచింది.

పూర్తి వివరాలు.. యూఎస్ లో (United states) ఒక యువతి అతిచిన్న వయసులోనే అనేక రంగాలలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. ఒక ఉద్యోగం చేస్తునే ప్రతిసారి దానికన్నా బెటర్ మెంట్ ఉద్యోగం (Jobs) కోసం ట్రై చేస్తు ఉండేది. లండన్ (London)  కు చెందిన అనస్తాసియా సెచెట్టో అనే యువతికి 23 ఏళ్లు. ఆమె ప్రస్తుతం 23 ఉద్యోగాలను చేసింది. చేసిన ప్రతి ఉద్యోగంలోను తనకంటూ మంచి గుర్తింపును సంపాదించింది. ఆమె రష్యా, ఇటాలియన్, ఇంగ్లీష్, డచ్ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడేది. అనస్తానియా.. మొదట.. బేకరీలో జాబ్ తో తన కెరియర్ ప్రారంభించింది.



ఆ తర్వాత.. డిష్ వాషర్, వెయిటర్, క్యాషియర్, సేల్స్ వర్కర్, పియానో టీచర్, మార్కెట్ సెల్లర్, ఈవెంట్ ఆర్గనైజర్, రిటైల్ వర్కర్, నటన, మోడలింగ్ రంగాలలో పనిచేసింది. అదే విధంగా.. బేబీ సిట్టింగ్, అనువాదకురాలిగా, ఫోటొగ్రఫి వర్కర్ గా, కంటెంట్ రైటర్ గా, ఎస్ఈవో స్పెషలిస్ట్, ఫ్రీలాన్సర్ సోషల్ మీడియా మెనేజర్ గా, ఆన్ లైన్ పర్సనల్ ట్రైనర్ గా, లగ్జరీ హోటల్ కి క్రియేటివ్ డైరెక్టర్ గా (The best employee)  పనిచేసింది.

చేసిన ప్రతి ఉద్యోగంలో తన ట్యాలెంట్ ను (Talent)  ప్రూవ్ చేసుకుంది. అదే విధంగా, బెటర్ మెంట్ ఉద్యోగంలో మారుతు వచ్చింది. అన్ని ఉద్యోగాలలో అనేక అనుభవాలను ఎదుర్కొంది. చివరకు సొంతంగా మార్కెటింగ్ ఏజెన్సీ స్థాపించి దానికి సీఈవో అయ్యింది. ప్రస్తుతం ఈ లండన్ అమ్మాయి.. అనస్తాసియా సెచెట్టో వార్త సోషల్ మీడియాలో (Social media)  ట్రెండింగ్ మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: JOBS, London, United states, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు