సాధారణంగా కొంత మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుతుంటారు. వీరు తమ పెంపుడు జంతువులను తమ ఇంటిలో మనిషిగా చూసుకుంటారు. వాటి కోసం సపరేట్ ఫుడ్, బెడ్ లను ఏర్పాటు చేసి స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఇక అవి కూడా తమ ఓనర్ పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. అయితే, పెంపుడు జంతువులను పెంచే అవకాశం లేని వారు.. రోడ్డు పక్కన మూగ జీవులకు ఏదైన తినే పదార్థాలు పెట్టి ఆనంద పడి పోతుంటారు. తమకు ఉన్న దానిలో వాటికి కావాల్సిన ఆహరం పెట్టి తెగ సంబర పడిపోతారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. కెన్యాలోని (Kenya) నైరోబిలో మనోర్ అనే హోటల్ ఉంది. అక్కడ హోటల్ పక్కన అడవికి దగ్గరలో ఉంది. అయితే, అక్కడ కొన్ని జిరాఫీలు ఉన్నాయి. హోటల్ యజమాని ప్రతి రోజు వాటికి ఏదైన ఆహరం తినడానికి పెడుతుంది. ఈ వీడియోలో మూడు జిరాఫీలు (Giraffes) కన్పిస్తున్నాయి. ఆ మహిళ హోటల్ బాల్కనీ నుంచి వాటికి ఆహారం (Woman Gives Food To Giraffes) పెడుతుంది. అవి మూడు కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేసుకొకుండా ప్రశాంతంగా ఆహరం తింటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహిళకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమకు, ఆమె మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Man dances with 2 giant pythons on his shoulders
సాధారణంగా కొంత మందికి పాములు, కొండ చిలువలంటే తెగ భయపడిపోతుంటారు. ఇక కొందరైతే దాని పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు. పాములు, ఆహారం కోసం, దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలా అరుదుగా మనుషులను కాటువేస్తాయి. ఇక కొండ చిలువలు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవులలో ఎక్కువగా ఉంటాయి.
కొందరు పాములు, కొండ చిలువలను చూస్తే చేసే రచ్చ మాములుగా ఉండదు. కొందరు స్నేక్ క్యాచ్ సొసైటీకి వారికి సమాచారం అందిస్తారు. మరికొందరు.. అక్కడి దరిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయరు. స్నేక్ క్యాచర్ చాలా కష్టపడి పాములను పట్టుకుంటారు. ఇక కొందరు పాములు, కొండ చిలువలతో సరదాగా ఆడుకుంటారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొండ చిలువను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. రెండు కొండ చిలువలు వీడియోలో కన్పిస్తున్నాయి. వాటిని తన చేతిలో పట్టుకుని డీజేపాటను పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. రెండు పైథాన్ లను తన వీపుపై మోసుకుంటు పాటకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే పైతాన్ ను బాలిక ఆడుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. తాజగా,ఈ వీడియో వైరల్ అవుతుంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.