Home /News /trending /

WOMAN GIVES BIRTH TO BABY WITH FOUR LEGS AND FOUR HANDS IN KATIHAR DISTRICT IN BIHAR VIRAL PHOTOS MKS

Shocking: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం.. భగవంతుడి అవతరమంటూ..

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు

సహజ ప్రసవం సాధ్యంకాకపోవడంతో సిజేరియన్ చేసి శిశువును బయటికి తీశారు.. అప్పుడుగానీ అందరూ షాక్ తిన్నారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న వింత శిశువును చూసి కుటుంబీకులు ఆశ్చర్యపోయారు.. ఇలా ఎందుకు జరిగిందంటూ డాక్టర్లతో గొడవకు దిగారు..

ఇంకా చదవండి ...
ఆ తల్లి గర్భందాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళుతూనే వచ్చింది.. నెలలు నిండిన తర్వాత స్కానింగ్ రిపోర్టుల్లోనూ అంతా నార్మల్ గానే ఉందని డాక్టర్లు చెప్పేవాళ్లు.. అనుకున్న సమయానికే ప్రసవసం కోసం ఆస్పత్రిలో చేరింది.. సహజ ప్రసవం సాధ్యంకాకపోవడంతో సిజేరియన్ చేసి శిశువును బయటికి తీశారు.. అప్పుడుగానీ అందరూ షాక్ తిన్నారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న వింత శిశువును చూసి కుటుంబీకులు ఆశ్చర్యపోయారు.. ఇలా ఎందుకు జరిగిందంటూ డాక్టర్లతో గొడవకు దిగారు.. బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలో తాజాగా చోటుచేసుకుందీ ఘటన. స్థానిక సదార్ ఆస్పత్రి వర్గాలు, బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాలివి..

కతిహార్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చే హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు సాహ్ దంపతులకు వింత శిశువు జన్మించింది. భార్య గర్భందాల్చినప్పటి నుంచి కతిహార్ పట్టణంలోని సదార్ ఆస్పత్రిలో చూయించుకునేవారు. నెలలు నిండటంతో ఈ మధ్యే ఆమెకు ఆపరేషన్ చేయగా, వింత శిశువు బయటపడింది. పెద్దగా చదువుకోని రాజు గ్రామస్తులంతా ఈ నాలుగు కాళ్లు, నాలుగు చేతుల శిశువును భగవంతుడి అవతరాంగా భావించి, పొటోమంటూ ఆస్పత్రికి వచ్చి దర్శనాలు కూడా చేసుకున్నారు. కానీ,

దివ్యాంగ శిశువుతో తల్లి

UP Elections 2022: 'బికినీ గర్ల్‌'పై బీజేపీ గరంగరం.. కలిపి చూడొద్దన్న Archana Gautam


రాజు కుటుంబీకులు మాత్రం నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయేంటని వైద్య సిబ్బందిని నిలదీశారు. ప్రైవేటు క్లినిక్​ వైద్యులపై బంధువులు ఆరోపణలు చేశారు. గతంలో స్కానింగ్​ తీసినప్పుడు దీని గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదని ఆందోళన చెందారు. ఎప్పుడు అడిగినా శిశువు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పేవారని.. చివరకు వింత శిశువు జన్మించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి,

దివ్యాంగ శిశువు

Viral Emirates Ad : బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే Video



విషయం పోలీసులకు ఫిర్యాదుదాకా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్లు మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాజు భార్యకు పుట్టింది వింత శిశువు కాదని, దివ్యాంగులుగా పిలుస్తారని సదర్​ ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పారు. నిజానికి కవల పిల్లలు జన్మించాల్సి ఉండగా, తల్లి గర్భంలో రెండు పిండాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలా ఒకే శిశుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఏర్పడ్డాయని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతానికి తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. రాబయే రోజుల్లో శిశువు ఆరోగ్యానికి ముప్పు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bihar, Viral photos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు