హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fastest delivery: పురిటి నొప్పులు లేకుండా అర నిమిషంలోనే ప్రసవించిన మహిళ.. ఇదొక రికార్డు అంటున్న వైద్యులు

Fastest delivery: పురిటి నొప్పులు లేకుండా అర నిమిషంలోనే ప్రసవించిన మహిళ.. ఇదొక రికార్డు అంటున్న వైద్యులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళకు అర నిమిషంలోనే ప్రసవం అయింది. కేవలం 27 సెకండ్లలోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

మహిళల జీవితంలో చావు, పుట్టుక సమస్య ఎదురయ్యేది ప్రసవ సమయంలోనే. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి మరోజన్మ ఎత్తుతుందని చెబుతుంటారు. కొన్నిసార్లు ఈ ప్రసవ నొప్పులు గంటల తరబడి ఉంటాయి. అయితే బ్రిటన్‌కు చెందిన ఒక మహిళకు అర నిమిషంలోనే ప్రసవం అయింది. కేవలం 27 సెకండ్లలోనే బిడ్డకు జన్మనిచ్చింది బ్రిటన్‌కు చెందిన 29 ఏళ్ల సోఫీ బగ్. దీంతో వేగంగా శిశువుకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన సోఫీ బగ్ 38 వారాల నిండు గర్భిణి. ఆమె హాంప్ షైర్ లోని బేసింక్ స్టోక్‌ ప్రాంతంలో నివాసముంటుంది. ఒకరోజు అర్ధరాత్రి బాత్‌రూంకు వెళ్లగా.. పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో సాయం కోసం భర్తను పిలిచింది. భర్త క్రిస్ (32) వచ్చేలోపు బాత్రూం బయట మెట్లపై ఉన్న సోఫీ ఒక్క పుష్ ఇచ్చింది. దీంతో కొన్ని క్షణాల్లోనే బిడ్డ బయటకు వచ్చింది.

చూస్తుండగానే ప్రసవం కావడంతో క్రిస్, సోఫీ దంపతులు ఎంతో సంతోషించారు. వీరికి పాప పుట్టింది. ‘టాయిలెట్‌లో ఉండగానే సోఫీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె నన్ను గట్టిగా పిలిచింది. నేను వెళ్లేలోపు బాత్‌రూం బయట సోఫీ కూర్చొని ఉంది. అప్పటికే ప్రసవం అవుతోందని గ్రహించాను. గట్టిగా పుష్ చేయమని చెప్పాను. తను అలాగే చేసింది. దీంతో కేవలం 27 సెకన్లలోనే పాప జన్మించింది. అంతా చాలా వేగంగా జరిగిపోయింది’ అని చెబుతున్నారు క్రిస్.

బాత్‌రూంకు వెళ్లిన సోఫీకి పురిటి నొప్పులు కూడా రాలేదట. ‘టాయ్‌లెట్లో ఉన్నప్పుడే ప్రసవం అవుతోందని అనిపించింది. ఆ సమయంలో పెద్దగా నొప్పులు కూడా రాలేదు. కానీ బిడ్డ తల బయటకు వస్తున్నట్లు అర్థమైంది. నా భర్తను సహాయం కోసం పిలిచాను. తను వచ్చాక.. ఒక్కసారి గట్టిగా పుష్ చేయగానే శిశువు బయటకు వచ్చింది’ అని సోఫీ తెలిపింది. ఆ తరువాత డాక్లర్లు వచ్చి పాప బొడ్డు తాడు కత్తిరించారు. అనంతరం తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత వారిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ ఘటనతో వేగంగా ప్రసవించిన మహిళగా సోఫీ రికార్డు సృష్టించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోఫీ ఇంత వేగంగా బిడ్డకు జన్మనివ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ తన మొదటి బిడ్డను ఇంతే వేగంగా ప్రసవించింది. బాత్రూంకి వెళ్లిన 12 నిమిషాల్లోనే ఆమె ప్రసవించింది. 2013లో ఈ సంఘటన జరిగింది. రెండో ప్రసవం కూడా బాత్రూంకి వెళ్లిన 26 నిమిషాల్లో జరగడం విశేషం.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Pregnancy, Uk

ఉత్తమ కథలు