Home /News /trending /

WOMAN GETS TOOTHBRUSH STUCK IN MOUTH IN FREAK ACCIDENT UNDERGOES SURGERY IN TAMIL NADU KANCHIPURAM MKS

Shocking: మ‌హిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌బ్ర‌ష్‌.. దాన్ని తీయడానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది!

బాధిత మహిళకు సర్జరీ

బాధిత మహిళకు సర్జరీ

ఓ మహిళ పళ్లు తోముకొంటుండగా గొంతులో టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది.. దాన్ని తీయడానికి డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.. నిజానికి ఆమెకు జరిగిన ఘటన విదారకమైనది కూడా..

మీకు తెలుసా? మన దేశంలో పళ్లు తోముకుంటుండగా వ్యక్తులు గాయపడుతోన్న కేసులు క్రమంగా పెరుగుతున్నాయని? ప్రధానంగా మెట్రో నగరాలు కొలువైన రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పళ్లు తోముకునేటప్పుడు వేరే పనులుల్లో బిజీగా ఉండటం, బ్రషింగ్ పై అశ్రద్ధ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే బ్రష్ గాయాల బాధితుల్లో పిల్లలే ఎక్కువ. కొన్నిసార్లు పెద్దలకు కూడా అలా జరుగుతోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ గొంతులో టూత్ బ్రష్ ఇరుక్కుపోగా దాన్ని తీయడానికి డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఆమెకు జరిగిన ఘటన విదారకమైనది కూడా..

త‌మిళ‌నాడులోని కాంచిపురానికి చెందిన 34 ఏళ్ల రేవ‌తి అనే మ‌హిళ ఇటీవల తీవ్రంగా గాయపడింది. ఉదయం పూట బ్రషింగ్ చేస్తున్నక్రమంలో కాలు జారి బాత్రూమ్ లో బొక్కబోర్లా పడిపోయింది. నోట్లో బ్రష్ ఉండగా ఆమె తల వెళ్లి నేల‌కు బలంగా గ‌ట్టిగా తాకింది. దీంతో గట్టిగా ఉండే ఆ ప్లాస్టిక్ బ్రష్ ఆమె చెంపలను చీల్చుకుంటూ గొంతులోకి దూసుకెళ్లింది..

Russia Ukraine war: పుతిన్‌, జెలెన్‌స్కీకి PM Modi ఫోన్ కాల్.. కీలక సూచన -అలా చేస్తే యుద్ధం ఆగేనా!


రక్తం ధారగా కారిపోతున్నా, గొంతులో బ్రష్ ఇరుక్కోవడం వల్ల కనీసం గట్టిగా అరవలేక రేవతి బాత్రూమ్ లో నరకయాతన అనుభవించింది. లోపల శబ్దాన్ని గమనించిన కుటుంబీకులు కొద్దిసేపటికి వచ్చిచూసి షాకయ్యారు. వెంట‌నే రేవతిని కాంచీపురం ప్ర‌భుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ప‌రిస్థితిని చూసిన డాక్ట‌ర్లు సైతం తొలుత కంగుతిన్నారు. ప్రాథమిక చికిత్స మొదలుపెట్టి, పెద్ద డాక్టర్లకు కబురుపెట్టారు..

రైతులకు శుభవార్త : ఆ రుణాలన్నీ మాఫీ -రూ. 16,144 కోట్ల భారం తగ్గినట్లే -సాగుకు భారీగా నిధులు


నిమిషాల వ్యవధిలోనే డాక్టర్ల బృందం ఏకమై రేవతి కేసును క్షుణ్నంగా పరిశీలించింది. టూత్‌బ్ర‌ష్.. రేవ‌తి చెంప‌ను చీల్చుకుంటూ స‌గం బ‌య‌టికి రావ‌డం వ‌ల్ల చెంప నుంచే దాన్ని బ‌య‌టకు తీయాల‌ని డాక్టర్లు నిర్ణయించారు. అప్పటికే స‌గం టూత్‌బ్ర‌ష్ ఆమె ప‌ళ్ల కింద ఇరుక్కుపోయి ఉండటంతో చెంప‌పై ఇంకాస్త చీలిక పెట్టి లోప‌ల ఇరుక్కుపోయిన బ్ర‌ష్‌ను బ‌య‌టికి తీశారు డాక్ట‌ర్లు. ఆ తర్వాత చీలిపోయిన చెంపకు కుట్లువేశారు. రేవతి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సున్నితమైన స‌ర్జ‌రీని విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్లను ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Doctors, Tamil nadu, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు