• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WOMAN GET PREGNANT WHILE PREGNANT AND GIVES BIRTH TO NON IDENTICAL TWINS AT A TIME DOCTOR CALLED IT AS SUPERFETATION HSN GH

Superfetation: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

Superfetation: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

రెబెక్కా రాబర్డ్స్ (ఫేస్ బుక్ ఫొటో)

భార్య గర్భవతి అయింది. ఆ జంట యమా హ్యాపీగా ఫీలయింది. గర్భవతి అయిన భార్యతో ఆ భర్త శృంగారంలో కూడా పాల్గొన్నాడు. కొద్ది నెలల తర్వాత కడుపులో బిడ్డ ఎదుగుదలను పరిశీలించేందుకు ఆమెకు స్కానింగ్ తీస్తే..

  • Share this:
సృష్టిలో ఆశ్యర్యాలకు, అద్భుతాలకు కొదువే లేదు. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పుడు మనం చెప్పుకునే అద్భుతం కూడా అలాంటిదే.. ఒక మహిళ రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చి వైద్య రంగానికే సవాలుగా మారింది. ఈ అరుదైన విచిత్ర ఘటన ఇంగ్లాండ్​లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్​లోని బాత్​కు చెందిన రెబెక్కా రాబర్డ్స్(39)​ అనే మహిళ కొద్ది నెలల క్రితం గర్భం దాల్చింది. అయితే, ఆమె కడుపుతో ఉండగానే తన భర్తతో శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె రోజుల వ్యవధిలోనే మరోసారి గర్భం దాల్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్​ 17వ తేదీన బాత్​లోని యునైటెడ్​ హాస్పిటల్​లో ఆమె ఆశ్చర్యకరంగా ఒకేసారి ఆడ, మగ బిడ్డలకు జన్మనిచ్చింది.

ఆడ బిడ్డకు రొసలీ అని పేరు పెట్టగా.. మగ బిడ్డకు నోవా అని పేరు పెట్టారు. ఆడ బిడ్డతో పోల్చుకుంటే మగ బిడ్డ పరిమాణంలో చాలా చిన్నగా బలహీనంగా జన్మించాడు. దీనికి కారణం ఆ బిడ్డ నెలలు నిండకుండా పుట్టడమే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆ బాలున్ని 95 రోజుల పాటు హాస్పిటల్​లోనే ఉంచి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకొని ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆ మగ బిడ్డకు ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ మరో మూడు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు.

గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చడం అరుదైన సంఘటన అని.. ఇది సూపర్​ఫెటేషన్​ కారణంగానే జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, నివేదికల ప్రకారం ఇటువంటి అరుదైన ఘటనలు ప్రపంచంలో 0.3% మంది మహిళల్లో మాత్రమే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కానీ, ఇలా జరిగిన చాలా సందర్భాలలో, రెండో శిశువు గర్భధారణ సమయంలోనే మరణిస్తుంది. కానీ, రెబెక్కా రాబర్డ్స్​కు జన్మించిన రెండో శిశువు కూడా ఆరోగ్యంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని వైద్యులు చెబుతున్నారు.

Superfetation, Woman, non-identical twins, pregnant, Rebecca Roberts, Noah, Rosalie, twins, మహిళ, గర్భం, రెబెక్కా రాబర్డ్స్, ఇంగ్లండ్​, సూపర్​ఫెటేషన్​, డబుల్​ ప్రెగ్నెన్సీ
రెబెక్కా రాబర్డ్స్ (ఫేస్ బుక్ ఫొటో)


0.3% మహిళల్లోనే సూపర్​ఫెటేషన్..
కాగా, దీనిపై రెబెక్కా రాబర్డ్స్ మాట్లాడుతూ.. "నేను గర్భం దాల్చగానే బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు డాక్టర్లు స్కాన్​ చేశారు. అప్పుడు గర్భంలో ఒక్క బిడ్డ మాత్రమే ఉంది. మూడు వారాల తర్వాత మరోసారి బిడ్డ పెరుగుదల కోసం మరోసారి స్కాన్​ చేస్తే.. గర్భంలో మరో బిడ్డ కూడా ఉందని వైద్యులు చెప్పారు. ఈ విషయం వినగానే నేను ఆశ్చర్యానికి లోనయ్యను.”అని అన్నారు. కాగా, ఇదే విషయంపై డాక్టర్లు స్పందిస్తూ.. ఇటువంటి గర్భాన్ని సూపర్ఫేటేషన్​ లేదా డబుల్​ ప్రెగ్నెన్సీ అంటారని చెప్పారు. అంతేకాదు, ఆమె ప్రెగ్నెన్సీ కోసం వాడిన మందుల వల్లే ఇలా డబుల్​ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. రెబెక్కా తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంలో మరో అండం విడుదలై ఉంటుందని.. అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని వైద్యులు పేర్కొంటున్నారు.

సూపర్​ఫెటేషన్​ అంటే?
సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చగానే అండాశయం అండాలను విడుదల చేయడం నిలిపివేస్తుంది. కానీ, సూపర్​ఫెటేషన్​ అనే అత్యంత అరుదైన సందర్భంలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతుంది. మహిళ గర్భంతో ఉన్నప్పటికీ అండం విడుదలవుతుంది. ఆ సమయంలో మహిళ శృంగారంలో పాల్గొంటే, పురుషుడి వీర్యం అండాన్ని చేరి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్​ఫెటేషన్​ అత్యంత అరుదుగా జరుగుతుంటుంది.
First published:

అగ్ర కథనాలు