హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

22 Year Old Woman: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన భార్య.. ఆమె భర్త ఒకేఒక్క మాటన్నాడు..

22 Year Old Woman: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన భార్య.. ఆమె భర్త ఒకేఒక్క మాటన్నాడు..

ముగ్గురు బిడ్డలతో మహిళ

ముగ్గురు బిడ్డలతో మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ పరిధిలోని ఝిగుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల వివాహిత ఆగ్రాలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.

హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ పరిధిలోని ఝిగుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల వివాహిత ఆగ్రాలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మూడు నిమిషాల తేడాతో ముగ్గురూ ఈ బయట ప్రపంచాన్ని చూశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడంతో హెల్త్ వర్కర్స్, నర్సులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ మహిళను ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆ మహిళ బిడ్డలతో కలిసి ఊళ్లోకి రాగానే పండగ వాతావరణం నెలకొంది. తనకు ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించడంపై ఆమె భర్త సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఆ బిడ్డలు ‘దేవుడిచ్చిన వరప్రసాదం’ అని ఒక్కమాటలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ ముగ్గురు పసి బిడ్డలను గ్రామస్తులు తదేకంగా చూశారు.

ఇది కూడా చదవండి: Affair: భర్తకు వయసైపోయిందనుకుందో.. కుర్రాడితో ఎంజాయ్ చేయాలనుకుందో.. కానీ ఆమె అనుకుంది వేరు.. జరిగింది వేరు..

ఆ 22 ఏళ్ల వివాహితకు ఇంట్లో ఉండగా పురిటి నొప్పులొచ్చాయి. సహజ ప్రసవం కష్టమని భావించి ఆమెను ఆగ్రాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి ముగ్గురు బిడ్డలను క్షేమంగా తల్లి కడుపులో నుంచి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఒక్కో బిడ్డ మూడు నిమిషాల తేడాతో జన్మించినట్లు వైద్యులు తెలిపారు.

First published:

Tags: Mother, New born baby, Pregnant women, Uttar pradesh

ఉత్తమ కథలు