WOMAN FROM SPAIN DRINKS HER OWN MENSTRUAL BLOOD SAYS IT IS HIGHLY PACKED WITH NUTRIENTS SK
OMG: తన పీరియడ్స్ రక్తాన్ని తాగుతున్న మహిళ.. ముఖానికీ ఫేసియల్.. ఎన్నో లాభాలట
ప్రతీకాత్మక చిత్రం
Women drinks her menstrual blood: పీరియడ్స్ రక్తాన్ని తాగడమే కాదు.. ముఖానికి ఫేసియల్‌గా కూడా వాడుతోంది. తన బ్యూటీ సీక్రెట్ కూడా అదేనని జాస్మిన్ చెబుతోంది
పీరియడ్స్ (Menstrual periods) సమయంలో జరిగే రక్తస్రావాన్ని చాలా మంది చెడు రక్తంగా భావిస్తారు. భారత్ సహా పలు దేశాల్లో అయితే ఆ సమయంలో కొందరు ఇళ్ల నుంచి బయటకే రారు. దేవుళ్లు ఉండే గదిలోకి వెళ్లరు. ఎలాంటి శుభకార్యాల్లో కూడా పాల్గొనరు. అపవిత్రంగా భావిస్తారు. ఆ రక్తాన్ని చేతితో ముట్టుకునే సాహసం కూడా చేయరు. కానీ స్పెయిన్‌లో ఓ మహిళ మాత్రం ఏకంగా ఆ రక్తాన్ని తాగుతుంది (Spanish Women drinks her menstrual blood) . తన రుతు రక్తాన్ని తనే స్వయంగా తీసుకుంటోంది. వినేందుకు చాలా జుగుప్సాకరంగా ఉన్నా.. ఇది నిజమని ఆమె చెబుతోంది. తాను చాలా రోజులుగా ఇలా చేస్తున్నానని.. పీరియడ్స్ రక్తం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తోంది.
ఇక్కడున్న ఈ మహిళ పేరు జాస్మిన్ అలీసియా కార్టర్ (Jasmine Alicia carter). వయసు 30 ఏళ్లు. పెళ్లలయింది. రెండెళ్ల పాప కూడా ఉంది. స్పెయిన్‌లోని బార్సెలోనా నివసిస్తోంది. ఇంతకుముందు హోటల్‌లో వెయిట్రెస్‌గా పనిచేసేది. కొన్నాళ్ల క్రితం ఆ జాబ్ వదిలేసింది. ఇప్పుడు మహిళ రుతు సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు చేస్తోంది. దానినే కెరీర్‌గా ఎంచుకుంది. ఐతే తాజాగా రుతుస్రావానికి సంబంధించి జాస్మిన్ సంచలన కామెంట్స్ చేసింది. తాను తన పీరియడ్స్ రక్తాన్ని తాగుతానని చెప్పడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. తనకు పీరియడ్స్ వచ్చే రోజుల్లో ఒక కప్‌లో రక్తాన్ని పట్టుకొని... దాన్ని అలాగే తాగుతానని చెప్పింది. ఇలా చేయడం వల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఆధ్యాత్మికంగానూ చాలా ప్రశాంతత చేకూరుతోందని తెలిపింది.
పీరియడ్స్ రక్తాన్ని తాగడమే కాదు.. ముఖానికి ఫేసియల్‌గా కూడా వాడుతోంది. తన బ్యూటీ సీక్రెట్ కూడా అదేనని జాస్మిన్ చెబుతోంది. రుతుక్రమ రక్తంలో ఐరన్, ప్రొటీన్, స్టెమ్ సెల్స్ వంటి పోషకాలు ఉన్నాయని.. అందుకే పీరియడ్ రక్తం తాగడం ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పింది. తనకు పీరియడ్స్ వచ్చినప్పుడు వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. మెన్ట్రువల్ కప్‌లోకి పడిన రక్తాన్ని.. అలాగే తీసుకొని తాగుతానని పేర్కొంది. అంతేకాదు మీ పీరియడ్ రక్తం రంగు, చిక్కదనాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చని అభిప్రాయపడింది. జాస్మిన్ అలీసియా అంతటితో ఆగలేదు. పీరియడ్స్‌పై తనకున్న ఇష్టాన్ని వ్యాపారంగా మార్చేసింది. సాక్సెస్ మెన్‌స్ట్రువల్ కప్స్‌ని స్వయంగా రూపొందించి.. వాటిని మహిళలకు విక్రయిస్తోంది. మెన్‌స్ట్రువల్ ఆర్ట్ మూవ్‌మెంట్‌ని కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రపంచంలో రుతుక్రమానికి సంబంధించి ఎంతో మంది మహిళలకు ఇంకా అనుమానాలు, అపోహలు ఉన్నాయని.. వాటి గురించి అవగాహన కల్పిస్తున్నానని జాస్మిన్. శానిటరీ నాప్‌కిన్స్‌లో ఎన్నో రకాల రసాయనాలను వాడుతున్నారని... అలాంటి వాటిని వినియోగించవద్దని ఆమె సూచిస్తున్నారు. వాటి స్థానంలో మెన్‌స్ట్రువల్ కప్స్ వాడితే ఉపయోకరంగా ఉంటుందని చెప్పారు. ఏదైమైనా ఈమె గురించి తెలిసిన తర్వాత నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఛీ.. ఛీ.. పీరియడ్స్ రక్తాన్ని తాగుతావా? మనిషి? రాక్షసిగా అని తిడుతున్నారు. అయినా ఆమె మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. పీరియడ్స్ గొప్పతనం గురించి తనకు తెలిసినంతగా.. బహుశా ఇంకెవరికీ తెలియదేమోనని చెబుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.