హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Tooth in food : విమానంలో ఇచ్చిన ఆహారంలో మనిషి పన్ను..ఎయిర్ లైన్స్ షాకింగ్ ఆన్సర్

Tooth in food : విమానంలో ఇచ్చిన ఆహారంలో మనిషి పన్ను..ఎయిర్ లైన్స్ షాకింగ్ ఆన్సర్

ఆహారంలో మనిషి పన్ను

ఆహారంలో మనిషి పన్ను

Woman finds tooth in food : విమాన ప్రయాణికులకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది మధ్య జరిగిన గొడవలు జరగడం, ఆహారంలో బొద్దింకలు లేదా పురుగులు కనిపించడం వంటి వింత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman finds tooth in food : విమాన ప్రయాణికులకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది మధ్య జరిగిన గొడవలు జరగడం, ఆహారంలో బొద్దింకలు లేదా పురుగులు కనిపించడం వంటి వింత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అనేక సందర్భాలలో ప్రయాణికులు తమకు ఎదురైన చేదు అనుభవనాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసేవారు. తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు ఫ్లైట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా..ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. @ghadaelhoss అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో ఓ మహిళ.. బ్రిటీష్ ఎయిర్ వేస్(British_Airways)లో తనకు తనకు లభించిన ఆహారం ఫొటోని షేర్ చేశారు. ఆ ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో ఓ మనిషి పన్ను లేదా దంతం ఉండటంతో షాక్ కు గురైన ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

"అక్టోబర్ 25న లండన్ నుండి దుబాయ్‌కి వెళ్లే BA107 విమానంలో మాకు ఇచ్చిన ఆహారంలో కనుగొన్న ఈ డెంటల్ ఇంప్లాంట్(ఆహారంలో పన్ను ఉంది) గురించి మీ నుండి వినడానికి @British_Airways ఇంకా వేచి ఉంది (ఇది నా దంతం కాదు,నా దంతాలన్నీ భద్రంగా ఉన్నాయి). ఇది భయానకమైనది. మీ కాల్ సెంటర్ నుండి నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను" అనే క్యాప్షన్ తో తనకు ఇచ్చిన ఆహారంలో పన్ను లేదా దంతం ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mandous Photos : మాండస్ తుఫాను బీభత్సం.. తమిళనాడు , దక్షిణ ఏపీ అల్లకల్లోలం

దీనిపై నెటిజన్లు..బ్రిటీష్ ఎయిర్ లైన్స్ ను విమర్శిస్తూ కామెంట్లు,పోస్ట్ లు చేశారు. ఈ క్రమంలో ఈ ఇష్యూపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. మహిళ పోస్ట్‌ప బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పందిస్తూ..."హలో, దీన్ని చూసినందుకు చాలా చింతిస్తున్నాము. మా కస్టమర్ రిలేషన్స్ టీమ్ మిమ్మల్ని సంప్రదించడానికి మీరు మా క్యాబిన్ సిబ్బందికి మీ వివరాలను అందించారా? భద్రత కోసం, దయచేసి మాకు ఏవైనా వ్యక్తిగత వివరాలను DM ద్వారా పంపండి"అని తెలిపింది. అయితే బ్రిటీష్ ఎయిర్ వేస్ సమాధానం కూడా నెటిజన్లకు తీవ్ర కోపం తెప్పించింది.

First published:

Tags: Flight, Viral post

ఉత్తమ కథలు