ఇంటి కిటికీలో వింత ఆకారం... దెయ్యం అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో

దెయ్యం ఉందా... లేదా అంటే... కొందరు ఉందంటారు... కొందరు లేదంటారు... ఇది శతాబ్దాలుగా ఉన్న మిస్టరీ ప్రశ్నే. చిత్రమేంటంటే... ఆ దెయ్యాలున్నట్లు చెప్పుకునే వీడియోల్లో దెయ్యాలు ఎప్పుడూ క్లారిటీగా ఉండవు.

news18-telugu
Updated: September 21, 2020, 2:15 PM IST
ఇంటి కిటికీలో వింత ఆకారం... దెయ్యం అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో
ఇంటి కిటికీలో వింత ఆకారం... దెయ్యం అంటున్న నెటిజన్లు... వైరల్ వీడియో (credit - youtube)
  • Share this:
పాత బంగళాల్ని చాలా మంది భూత్ బంగ్లా అంటుంటారు. ఎందుకంటే... మనుషులు లేని భవనాల్లో భూతాలు, దెయ్యాలూ ఉంటాయన్న ఫీలింగే. ఆ ఫీలింగే నిజం అన్నట్లుగా... పాత భవనాల్లోనే ఎప్పుడూ ఏవో ఒక ఆకారాల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. "అరే.. అదేంటి... దెయ్యంలా ఉందే" అని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు మనం చెప్పుకునే వార్తలో కూడా అలాంటిదే జరిగింది. రెబెక్కా అనే మహిళ.. పాతదైపోయిన, వాడ‌టం మానేసిన తమ భవనాన్ని సరదాగా వీడియో తీసింది. అలా తీస్తూ... రన్నింగ్ కామెంటరీ కూడా చేసింది. అప్పుడు ఆమె ఆ భవనంలో ఏ వింత ఆకారాన్నీ చూడలేదు. ఆ వీడియోని తన కూతురికి పంపింది. ఆ తర్వాత మొదలైంది టెన్షన్.

ఆ పిల్ల చాలా తెలివైనది. ఏదైనా ఒక్కసారి చూసిందంటే... వెంటనే గుర్తుంచేసుకుంటుంది. ఆ వీడియోని చూసి... భయపడిపోయింది. వెంటనే వాళ్లమ్మకు కాల్ చేసి... "అందులో దెయ్యం ఉంది నేను చూశాను" అంది. "దెయ్యమ్మా... భలే దానివే... అలాంటివేవీ లేవు" అని అమ్మ ధైర్యం చెబుతుంటే... ఆ పిల్ల ఒప్పుకోలేదు. "నేను చెప్పేది నిజం... ఆ ఇంటి కిటికీ లోంచీ ఓ దెయ్యం నిన్నే చూసింది" అని చెప్పింది.

పాప అంతలా చెబుతుంటే... ఎందుకైనా మంచిదని ఆమె... మరోసారి వీడియోని రీ-ప్లే చేసింది. అప్పుడు కనిపించింది ఆ వింత ఆకారం. అంతే... ఆ పాప... ఆ వీడియోని టిక్‌టాక్‌లో షేర్ చేసింది. దాన్ని 20 లక్షల మందికి పైగా చూశారు. "ఆ వీడియోలో నేను ఓ దెయ్యం ఫేస్ చూశాను.. అది వెంటాడుతున్నట్లుగా ఉంది" అని పాప కాప్షన్ పెట్టింది.

పాప చెప్పినట్లుగానే... ఇంటి మూల కిటికీలో... ఓ చిన్నారి కిటికీ అద్దం దగ్గర తలపెట్టి బయటకు చూస్తున్నట్లుగా ఓ ఆకారం కనిపిస్తోంది. అందుకే... దీనిపై టిక్‌టాక్‌లో వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఎమెలీ అనే యువతి చేసిన ఓ కామెంట్ మాత్రం ఎక్కువ మందికి నచ్చింది. ఏంటంటే... ఆ ఇంటిని ఖాళీ చేసిన వాళ్లు... దాని దగ్గరకు ఎవరూ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో... ఓ బొమ్మను కిటికీ దగ్గర వేలాడ దీసి ఉంటారన్నది ఆ కామెంట్.

ఎమెలీ చేసిన కామెంటే నిజమైంది. ఎందుకంటే... అది నిజంగానే పాత బొమ్మ అట. దాన్ని కిటికీ దగ్గర వేలాడ దీశారని... రెబెక్కా తాజా వీడియో ద్వారా తెలిపింది. సో.. అది దెయ్యం కాదని ఇప్పుడు తేలిపోయింది.
Published by: Krishna Kumar N
First published: September 21, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading