హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అత్త పూజ చేస్తుండగా టీవీ సౌండ్ పెంచేసిన కోడలు.. తర్వాత.. ఏంజరిగిందంటే..

అత్త పూజ చేస్తుండగా టీవీ సౌండ్ పెంచేసిన కోడలు.. తర్వాత.. ఏంజరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: తన ఇంట్లో పూజ చేస్తుంటే కోడలు విజయ కావాలనే టీవీ సౌండ్ పెద్దగా పెట్టి టార్చర్ చేస్తుందని అత్త వృషాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మహారాష్ట్రలో (maharashtra) విచిత్రమైన సంఘటన జరిగింది. స్థానికంగా ఉండే అంబర్ నాథ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. 32 ఏళ్ల విజయ అనే మహిళ తన భర్త్, అత్తమామలతో కలిసి, గంగగిరి అపార్ట్ మెంట్ లో ఉంటుంది. అయితే.. కొన్నిరోజులుగా అత్తకోడళ్ళ మధ్య ఉప్పునిప్పుగా ఉంటుంది. వీరిద్దరి మధ్య అసలు పడట్లేదు. అయితే.. కోడలు ఎప్పుడు చూసిన అత్తను ఎలా సాధించాలో చూస్తుంది.ఈ క్రమంలో.. వినాయక చవితి సందర్భంగా అత్త పూజ చేసేటప్పుడు కోడలు కావాలనే టీవీ సౌండ్ పెద్దగా చేసి, ఆమె పూజను డిస్టర్బ్ చేస్తుంది. ఎంత చెప్పిన వినడం మానేసింది.ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు మరీ ఎక్కువయ్యాయి.

అయితే.. సోమవారం కూడా అత్త వృషాలి (60) పూజ చేసేటప్పుడు, కోడలు విజయ కావాలనే టీవీ సౌండ్ పెద్దగా చేసింది. భర్త చెప్పడానికి ప్రయత్నిస్తే అతనితో కూడా పొట్లాటకు తిగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన వృషాలి ఆమె చేతిలో నుంచి టీవీ రిమోట్ లాక్కుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. టీవీ రిమోట్ కోసం కోడలు.. అత్త చేతిని కోరికింది. అంతే కాకుండా అత్తమీద చేయిచేసుకుంది. వీరిద్దరి మధ్య గొడవ మరీ ఎక్కువ కావడంతో అత్త వృషాలి సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి కోడలి మీద ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఒక లేడీ పోలీసు మామపై దాడికి పాల్పడింది.

న్యూఢిల్లీలో (Delhi) అమానుష ఘటన సంభవించింది. ఒక లేడీ పోలీసుకు, ఆమె అత్తమామలకు మధ్య ప్రాపర్టీ విషయంలో గొడవ జరిగింది. ఇప్పటికే ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో.. లేడీ పోలీసు, అత్తమామలు ఉంటున్న లక్ష్మీనగర్‌లోని ఇంటికి వచ్చింది. అక్కడ వీరికి మాటమాట పెరిగింది. అక్కడ.. లేడీ పోలీసు రెచ్చిపోయింది. అత్తమామలను నోటికొచ్చినట్లు తిడుతూ.. భౌతికంగా దాడి చేస్తూ పిడిగుద్దులు కురిపించింది.

అక్కడున్న వారు.. ఆపడానికి ఎంత ట్రై చేసిన ఆమె ఎంత మాత్రం వినడం లేదు. పెద్దవాళ్లలను పదే పదే కొట్టింది. ఈ ఘటన గత ఆదివారం జరిగింది. ఈ గొడవ అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది సోషల్ మీడియాలో(Social media)  వైరల్ గా (Viral video) మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. లేడీ పోలీసుపై డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Family dispute, Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు