Viral Video: ఉడుతను దగ్గిరికి పిలిచి.. అరటిపండు తినిపించిన మహిళ

కొందరు మూగజీవాలను చూడగానే విసుగు తెచ్చుకుంటారు. మరికొందరు మాత్రం.. వాటికి ఆహారం అందించేందుకు, బాగాచూసుకునేందుకు ఆస్తకి చూపుతుంటారు. ఇందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: September 22, 2020, 10:13 AM IST
Viral Video: ఉడుతను దగ్గిరికి పిలిచి.. అరటిపండు తినిపించిన మహిళ
ఫొటో క్రెడిట్- Twitter/Susanta Nanda IFS
  • Share this:
కొందరు మూగజీవాలను చూడగానే విసుగు తెచ్చుకుంటారు. మరికొందరు మాత్రం.. వాటికి ఆహారం అందించేందుకు, బాగాచూసుకునేందుకు ఆస్తకి చూపుతుంటారు. ఇందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. కానీ దాని వల్ల కలిగే సంతృప్తి అంతా ఇంతా కాదు. మూగ జీవాల పట్ల దయగా వ్యవహరించడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. తాజాగా ఓ మహిళ ఉడుతను దగ్గరకు పిలిచి మరి దానికి అరటి పండు తినిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్టు చేశారు. ''అన్ని ప్రాణులతో దయతో మెలగండి.. అదే నిజమైన మతం" అని కూడా ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇక, 17 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ఓ మహిళ ఉడత‌ను దగ్గరికి పిలిచి మరి అరటి పండు ఇచ్చింది. పండును కింద పడేసి వెళ్లకుండా ఉడత నోట్లో పెట్టింది. ఈ వీడియో పులువురు నెటిజన్లను ఆకట్టకుంటుంది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ చాలా బాగా చెప్పారు అని, మరో నెటిజన్ అది చాలా నిజమైన మాట అని కామెంట్‌లు చేశారు.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading