WOMAN FALLS IN LOVE WITH A CHIMPANZEE AT THE ZOO AND THE WOMAN STATEMENT THAT BOTH OF THEM HAVE AN AFFAIR PRV
Chimpanzee Love: జూలో చింపాంజీతో మహిళ ప్రేమాయణం.. ఇద్దరికీ అఫైర్ ఉందంటూ మహిళ స్టేట్మెంట్
ప్రతీకాత్మక చిత్రం
ఓ మహిళ జంతువునే ప్రేమించిందట. ఏం మేం కూడా జంతువులను ప్రేమిస్తాం అంటారా? చేయొచ్చు. కానీ… ఈ ప్రేమ కథ(Love story) కొంచెం వింతగానే ఉంది. ఏకంగా ఇద్దరికీ అఫైర్ ఉందని ఆ మహిళే చెప్పడం గమనార్హం.
ప్రేమ(love) గుడ్డిది అంటాడో మహాకవి. ప్రేమకు హద్దులు కూడా లేవంటారు ప్రేమికులు. ప్రేమలో పడితే ఏదీ పెద్దగా పట్టించుకోరంటారు స్నేహితులు. ఇంతకీ ఈ ప్రేమ కహానీ దేనికంటారా? బెల్జియంలో ఓ బ్రహ్మాండమైన లవ్‌స్టోరి ఒకటి వెలుగుచూసింది. దేవదాసు, పార్వతి.. లైలా మజ్ను.. రోమియో జూలియట్.. ఇలాంటి ప్రేమ కథ అవుతుందో లేదో చెప్పలేం. ఎందుకంటారా? ఈ ప్రేమకథల్లో ఉన్నది మనుషులే. మరి బెల్జియం(Belgium) ప్రేమ కథలో ఉన్నది ఎవరనే కదా సందేహం. ఓ మనిషి, ఓ జంతువు(Animal). అవును ఓ మహిళ(women) జంతువునే ప్రేమించిందట. ఏం మేం కూడా జంతువులను ప్రేమిస్తాం అంటారా? చేయొచ్చు. కానీ… ఈ ప్రేమ కథ(Love story) కొంచెం వింతగానే ఉంది. ఏకంగా ఇద్దరికీ అఫైర్ ఉందని ఆ మహిళే చెప్పడం గమనార్హం. ఔరా.. ఇదేం చిత్రం అంటారా? ఇదంతా తెలిసి ఆ చింపాంజి ఉండే జూ(zoo) అధికారులు సైతం సదరు మహిళ(women)ను హెచ్చరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకేం ఒకసారి ఆ కహానీ ఏంటో చూద్దాం.. పదండి.
బెల్జియంకు చెందిన టిమ్మర్ సన్స్ అనే మహిళ ప్రతీ రోజూ అంట్వెర్ప్ ప్రాంతంలో జూకు వెళ్లేది. రోజులో ఎక్కువ సేపు జూలోనే గడిపేది. మొదట్లో ఆమెకు జంతువులపై ప్రేమ ఎక్కువని జూ సిబ్బంది అనుకున్నారు. అయితే ఆమె జూ మొత్తం తిరగకుండా.. ఒక్క చోటే ఎక్కువ సేపు గడుపుతూ ఉంది. చీతా(cheeta) అని 38 ఏళ్ల చింపాంజీ(chimpanzee)తో పిచ్చపిచ్చగా మాట్లాడేస్తుంది. జూ(zoo) అద్దానికి అటువైపు చింపాంజీ.. ఇటు ఏడీ టిమ్మర్‌మన్స్ ఏదేదో మాట్లాడుకునే వాళ్లు. అక్కడే ముద్దులు(kisses) పెట్టుకునే వారు. ఇలా ఒకట్రెండు వారాలు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాలు(years) నుంచి సాగింది.
జూకు వస్తున్న ఆ మహిళ చింపాంజీతో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు గుర్తించిన అధికారులు ఆమెను ఆరా తీశారు. అందుకామె చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. చింపాంజీతో తాను ఎక్కువ సమయం గడుపుతున్న మాట నిజమేనని, దానితో తాను ‘అపైర్’ పెట్టుకోవడం వల్లే అంత సమయం గడుపుతున్నానని చెప్పడంతో అధికారులు(officials) నిర్ఘాంతపోయారు. వెంటనే జూ అధికారులు చింపాంజీ, మహిళ మధ్య స్నేహం మరింత పెరగడకుండా అడ్డుకోవాలని భావించి ఆమెను జూకు రాకుండా నిషేధించారు(ban). తాను ఆ జంతువును ప్రేమిస్తున్నానని, అది కూడా తనను ప్రేమిస్తోందని ఏడీ వాదిస్తోంది. ఈ మాత్రానికే జూకు రాకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. తమ మధ్య అఫైర్(Affaire) ఉందని, అదే విషయాన్ని చెప్పానని తెలిపింది. అయితే, ఆమె అపైర్(affaire) కారణంగా చీతాకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని జూ అధికారులు చెబుతున్నారు. సందర్శకులతో చీతా బిజీగా ఉంటే ఇతర చింపాంజీ(chimpanzees)లు దానిని క్రమంగా మరిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ ప్రేమ సంగతి తెలిసిన చింపాంజీ ప్రేమికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దర్నీ విడదీయడం సరికాదు అని సలహా ఇస్తున్నారు. జూ అధికారులు చేసింది చాలా తప్పని వాదిస్తున్నారు. ప్రేమికులరాలికి మద్దతు ప్రకటించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.