Home /News /trending /

WOMAN FALL IN LOVE WITH WAITER IN HER DIVORCE PARTY FINALLY MARRIED HER IN AUSTRALIA AK

Divorced Woman: విడాకులు తీసుకుని పార్టీ చేసుకున్న మహిళ.. కానీ ఆ పార్టీలో ఎవరూ ఊహించని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

Trending News: పార్టీ ముగిసిన మరుసటి రోజు జాన్ అనే వెయిటర్‌ గాబ్రియెల్లాకు మెసేజ్ చేసి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నుండి వారి మధ్య సంభాషణ ప్రారంభమైంది.

    ఒక వ్యక్తి మరో వ్యక్తి జీవితంలోకి ఎఫ్పుడు ఎలా ప్రవేశిస్తాడో ఎవరికీ తెలియదు. తద్వారా అతడు తన జీవితాంతం ఆమెతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటాడు. తన పాత బంధాన్ని వదిలించుకున్న ఆనందంలో పార్టీ చేసుకున్న ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు అలాంటిదే జరిగింది. ఈ పార్టీలో తన జీవితంలో మరో అధ్యాయం మొదలవుతుందని ఆ మహిళకు తెలియదు. ఈ రోజుల్లో తన భర్త నుండి విడాకులు తీసుకున్నా ప్రతి సందర్భాన్ని ప్రజలు జరుపుకుంటారు. గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ తన విడాకుల వేడుకను జరుపుకోవడానికి పార్టీని నిర్వహించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పార్టీలోనే ఆమె తన తదుపరి జీవిత భాగస్వామిని పొందింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఈ కథ పూర్తిగా చిత్రమైనది. ప్రేమ ఎక్కడైనా, ఎవరితోనైనా పుట్టవచ్చని మనం అనేకసార్లు విన్నాం.

    గాబ్రియల్లా జీవితంలోనూ దాదాపుగా ఇలాగే జరిగింది. మిర్రర్ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా నివాసి గాబ్రియెల్లా లాండోల్ఫీ జీవితంలో ఎవరూ ఊహించని వింత చోటు చేసుకుంది. తన పాత భర్తతో సంబంధాన్ని ముగించుకున్న తర్వాత ఈ వేడుకను జరుపుకోవాలని ఆమె భావించింది. ఆమె అనుకున్నట్టు జరగడంతో ఓ భారీ విడాకుల పార్టీ ఏర్పాటు చేసింది. ఎంతోమంది ఆ పార్టీకి వచ్చారు. అలా పార్టీకి వచ్చిన వారిలో ఎవరో ఒక గెస్ట్‌ను చూసి ఆమె పెళ్లి చేసుకుంటే కథ వేరేలా ఉంది.



    కానీ ఈ పార్టీకి వచ్చిన వెయిటర్‌ ఆమెకు నచ్చాడు. పార్టీ ముగిసిన మరుసటి రోజుజాన్ అనే వెయిటర్‌ గాబ్రియెల్లాకు మెసేజ్ చేసి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నుండి వారి మధ్య సంభాషణ ప్రారంభమైంది. ఆ తరువాత వాళ్లు కలవడం మొదలుపెట్టారు. ఈ జంట కలవడం మొదలైన తరువాత వారి మధ్య ప్రేమ చిగురించింది. గాబ్రియెల్లా జాన్ కుమార్తె గురించి తెలుసుకున్నారు. ఆమె దానిని చాలా ఇష్టపడింది.

    పెన్సిల్ అడిగితే మా అమ్మ కొడుతుంది.. ప్రధాని మోదీకి బాలిక బహిరంగ లేఖ.. ఎక్కడంటే..

    Dating : మహిళా ఖైదీలతో డేటింగ్ చేయోచ్చంట!

    ఒక సంవత్సరం డేటింగ్ తర్వాత, జాన్ గాబ్రియెల్లాకు ప్రపోజ్ చేశాడు. అతని జీవితం చాలా పరిపూర్ణంగా సాగింది. నవంబర్ 2020 లో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, కానీ అంతకు ముందు గాబ్రియెల్లాకు గర్భస్రావం జరిగింది. అయినప్పటికీ డిసెంబర్, 2020లో వారి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, వారి సంబంధం చాలా బలపడింది. ఇద్దరు పిల్లలతో వారిది పూర్తి, సంతోషకరమైన కుటుంబంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు