పుట్టిన రోజు వేడుకలు రూపుమారాయి. కేకులు, ఫ్లవర్ బ్లాస్ట్‌లు లాంటివి చాలా రోజుల క్రితమే వచ్చేశాయి. అయితే ఈ క్రమంలో ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది యువత.
పుట్టిన రోజు వేడుకలు రూపుమారాయి. కేకులు, ఫ్లవర్ బ్లాస్ట్‌లు లాంటివి చాలా రోజుల క్రితమే వచ్చేశాయి. అయితే ఈ క్రమంలో ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది యువత. అదే కట్ చేయడానికి తీసుకొచ్చిన కేకును ముఖానికి రాయడం. ఇంకా విచిత్రం ఏంటంటే.. కేక్ కట్ చేసేవారి ముఖాన్ని బలవంతంగా కేకు మీద అమాంతం అదుముతున్నారు. ఇలాంటి ఓ పని ఓ యువతి కంటి చూపు పోయేంతవరకు తీసుకొచ్చింది. ఇంతకీ ఏమైందంటే...
సరదాగా అందరూ కలసి తినడానికి తెచ్చుకున్న కేకును ముఖానికి మెత్తేయడం చాలా సందర్భాల్లో చూశాం. ఈ క్రమంలో కళ్లలో క్రీమ్ పడి ఇబ్బందులు పడేవాళ్లు ఉన్నారు. అయితే అంతకుమించి ఇబ్బందులు ఎదుర్కొంది ఓ యువతి. కేకులో టూత్ పిక్స్ గురించి తెలియక.. స్నేహితులు దానిని ఆమె ముఖంపై బలంగా అదిమికొట్టారు. దీంతో ఆ కర్ర పుల్ల ఒకటి కంటి పక్కన గుచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి అరుపులు స్టార్ట్ చేసింది. విషయం అర్థం కాని స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు కంటి నుంచి రక్తం కారింది. వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
వెంటనే స్పందించిన వైద్యులు ఆ యువతి కంటి నుంచి కర్రపుల్లను తీసేశారు. కంటికి దగ్గరగా ఆ పుల్ల గుచ్చుకుందని వైద్యులు తెలిపారు. ఆమె చాలా అదృష్టవంతురాలని, కొంచెంలో కంటి చూపు కోల్పోయే ప్రమాదం జరిగేదని చెప్పారు. ఏమాత్రం ఆ కర్ర పుల్ల రెండు మూడు సెంటీమీటర్లు పక్కకు గుచ్చుకుంటే ఇబ్బంది జరిగేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక ఫొటో కేకులో కర్ర పుల్లలు కనిపిస్తుండగా, మరో ఫొటోలు కంటికి పక్కన కర్ర పుల్ల గుచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఆ కేక్ లేయర్లుగా తయారు చేయడం వల్ల.. సపోర్టింగ్ కోసం కర్ర పుల్లలు పెట్టి ఉంటారని స్నేహితులు అనుకుంటున్నారు. అయితే ఆ విషయం తెలియని వాళ్లు ఆ యువతి ముఖాన్ని బర్త్‌డే కేకు మీద మెత్తేశారు. ముందు ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు.
ఈ ఫొటోల కింద కామెంట్స్‌లో చాలామంది తమకు ఎదురైన అనుభవాల గురించి రాసుకొచ్చారు. కొంతమంది కేకును ఇలా ముఖానికి రాయడం వల్ల కళ్లకు ఇబ్బంది కలిగిందని రాశారు. నాకు ఇలాంటి కేక్ తెచ్చే ఫ్యాన్స్ లేకపోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకొంతమందైతే ఇలాంటి చర్యలు ఎవరికీ మంచివి కావని జాగ్రత్తలు చెప్పారు. మీరు కూడా ఇలాంటి పుట్టిన రోజు పార్టీలకు వెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దు, చేసేవాళ్లను ఎంకరేజ్ చేయొద్దు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.