Coconut Falls on Woman While Riding Two wheeler : ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. చెట్టుపైన పడి చనిపోవడానికి భయపడి ఇంట్లో కూర్చున్న వ్యక్తి.ఇంటిపై చెట్టు పడటంతో ఇళ్లు కూలి మృతిచెందాడని మన పెద్దలు పాత కథ ఒకటి చెబుతుంటారు. మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి. చాలా విషయాలు మనిషి నియంత్రణకు మించినవి. మనం అస్సలు ఊహించని లేదా అంతకంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన సంఘటనలు మనచుట్టూ నిత్యం జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ విచిత్రమైన యాక్సిడెంట్ లో ఓ యువతి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక మహిళ పెద్ద గుండ్రని కొబ్బరికాయ అకస్మాత్తుగా ఆమె తలపై పడటంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. మలేషియాలోని జలాన్ తెలుక్ కుంబార్ అనే పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
28 సెకన్ల నిడివిగల వీడియోలో... రైడర్ వెనుక కూర్చున్న బాధిత మహిళ ఒక్కసారిగా బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ నెత్తిమీద పడటంతో ముందు బైక్ నుండి పడి రోడ్డుపై దొర్లడం చూడవచ్చు. కొబ్బరికాయ చాలా బలంగా తాకడంతో ఆమె బైక్ పై నుంచి దొర్లుకుంటూ పడింది. ఆమె తలకి ఉన్న హెల్మెట్ కూడా ఊడిపోయి అవతల పడింది. ఇంతలో స్కూటర్ నడుపుతున్న మరో మహిళ, వాహనాన్ని ఆపి, దానిని రోడ్డు పక్కన ఆపి, గాయపడిన మహిళకు సహాయం చేయడానికి పరుగెత్తింది. అయితే, ఘటన జరిగినప్పుడు మహిళ హెల్మెట్ ధరించి ఉండడం వల్ల ఆమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మహిళ బైక్ పై నుంచి పడిపోగానే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. కొంతమంది స్థానికులు కూడా తమ వాహనాలను స్లో చేయమని రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులను అప్రమత్తం చేయడం ద్వారా ప్రమాదం తప్పి యువతి ప్రాణాలతో బయటపడింది. చుట్టుపక్కల వారి సహాయంతో మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. కాగా,ఘటన సమయంలో బాధిత మహిళ స్కూటర్‌పై..మరో ఫ్రెండ్ తో కలిసి తేలుక్ కుంబార్ నుండి జార్జ్ టౌన్ వైపు వెళ్తున్నట్లు సమాచారం.
Very Sad : బెంగళూరు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయల్దేరాడు..కొద్దిసేపటికే శవంగా ఇంటికి
మరోవైపు,చాలా ప్రమాదకరమైన బైకింగ్(Bike) వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించే ఒక రహదారి పూర్తిగా గుంటకు ఆనుకుని ఉంది. బైక్ రైడర్ కళ్లు కొంచెం అటుఇటుగా లేదా బ్యాలెన్స్ చెదిరిపోతే నేరుగా మృత్యువుకు చేరువవుతుంది. బైకింగ్ చేస్తున్నప్పుడు, వెనుక ఉన్న వ్యక్తి దిగి, అక్కడ నుండి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. చాలా బలమైన గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇటువంటి మార్గాల ప్రయాణాన్ని చూడగలరు. వైరల్ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జూన్ 23న అప్‌లోడ్ చేసిన వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడు మరణం అంచున వరకు వెళ్లొచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Bike accident, Viral Video