హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: ఉమ్మి అమ్మి లక్షల సంపాదన.. ఆమె వాడిన దుస్తులు,బెడ్‌షీట్స్‌కు ఫుల్ డిమాండ్‌..!

Viral: ఉమ్మి అమ్మి లక్షల సంపాదన.. ఆమె వాడిన దుస్తులు,బెడ్‌షీట్స్‌కు ఫుల్ డిమాండ్‌..!

Image:caters

Image:caters

డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో కొన్నింటిని చూస్తే.. ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా? అని ఆశ్చర్యం వేస్తుంది. ఎవరూ ఊహించని ఇలాంటి మార్గంలోనే లతీషా జోన్స్ అనే యువతి మనీ ఎర్న్‌ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Viral: డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో కొన్నింటిని చూస్తే.. ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా? అని ఆశ్చర్యం వేస్తుంది. ఎవరూ ఊహించని ఇలాంటి మార్గంలోనే లతీషా జోన్స్ అనే యువతి మనీ ఎర్న్‌ చేస్తోంది. ఎంతగా అంటే.. తన అప్పులు తీర్చి, ఫ్లాట్‌ కూడా కొనుగోలు చేసింది. ఇంతకీ ఆమె ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? నోటి ఉమ్మి(స్పిట్‌)తో నింపిన బాటిల్స్‌ను అమ్మడం.

ఇంగ్లాండ్‌కు చెందిన లతీషా జోన్స్, 22 ఏళ్ల బయోమెడికల్ సైన్స్ విద్యార్థి. ఆమె మాంచెస్టర్‌లోని టెస్కోలో తన ఖర్చులు, ఎడ్యుకేషన్ ఫీజు కోసం పార్ట్‌టైమ్ జాబ్‌ చేస్తోంది. ఉమ్మి, గోళ్ళ క్లిప్పింగ్‌లు, వారం రోజుల పాటు వాడిన బెడ్‌షీట్‌లు వంటి అసాధారణ వస్తువులకు డిమాండ్ ఉందని జోన్స్ తెలుసుకుంది. ఇలాంటి వాటికి ప్రజలు ఏకంగా £300 (రూ.30,000) నుంచి £1,500 (రూ. 1.5 లక్షలు) వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె గుర్తించింది. దీంతో ఆమె పార్ట్ టైమ్ జాబ్ వదిలేసి యూనివర్సిటీ నుంచి బయటకు రావాలని కూడా నిర్ణయించుకుంది.

* యూనిక్‌ ఐటెమ్స్‌ సేల్

తన ప్రయాణం ఊహించని విధంగా ప్రారంభమైందని జోన్స్‌ వివరించింది. ప్రారంభంలో పాపులర్‌ అయిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఓన్లీ ఫ్యాన్స్‌(OnlyFans)ను చూస్తున్నప్పుడు, ఫాలోవర్స్ నుంచి షవర్ వాటర్‌తో పాటు ఇతర వింత రిక్వెస్ట్‌లను చూసినట్లు చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినా, ఆసక్తి కొద్దీ వీటిపై ఆమె మరింత రీసెర్చ్‌ చేసింది. యూనిక్‌ ఐటెమ్స్‌ సేల్‌ గురించి తెలుసుకుంది. మొత్తానికి దీన్నే ఆమె భారీగా డబ్బు సంపాదించే మార్గంగా మార్చుకుంది.

* ఉమ్మి కోసం రిక్వెస్ట్

తన కస్టమర్ల డిమాండ్‌లను తీర్చడానికి, జోన్స్ చాలా రిసెర్చ్ చేసింది. ముందు కొందరు వ్యక్తులు ఆమెను స్పిట్‌ బాటిల్‌ అడిగారట, కానీ అప్పుడు ఆమె తిరస్కరించింది. జోక్‌గా ఇలా చేస్తున్నారని భావించింది. అయితే వెంటనే తన ఉమ్మి కోసం వచ్చిన రిక్వెస్ట్‌ నిజమైనదని తెలుసుకుంది. తర్వాత తన స్పిట్‌ బాటిల్‌కి £300 వసూలు చేసింది.

Acne: మొటిమలకు, అవయవాల ఆరోగ్యానికి సంబంధం.. ఏ ప్లేస్‌లో మొటిమలు దేనికి సంకేతం?

* వాటికి కూడా డిమాండ్

క్రమంగా జోన్స్‌కి అనేక ఇతర రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఆమె వారంపాటు పడుకున్న బెడ్‌షీట్స్ నుంచి చెమటతో తడిచిపోయిన జిమ్ దుస్తులు, బాత్‌వాటర్, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్ స్పిట్‌.. ఇలా అన్నింటికీ మంచి డిమాండ్ ఉంది. వీటన్నింటికీ డబ్బు వసూలు చేస్తూ ఆమె భారీగా సంపాదించింది.

ప్రజలు కోరుకునే రకరకాల వస్తువులను చూసి జోన్స్ ఆశ్చర్యపోయింది. జోన్స్ కేవలం తన ఉమ్మి ద్వారా సంపాదించిన అత్యధిక మొత్తం £1,500(రూ.1.5 లక్షలు). దీంతో విచిత్రమైన వాటి కోసం పెద్ద మొత్తంలో చెల్లించడానికి ఇష్టపడే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నా కెరీర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను సంతోషంగా ఉన్నాను. నేను దానిని ప్రేమిస్తున్నాను.’ అని చెప్పింది. ఈ కెరీర్‌తోనే తన £11,000 అప్పు చెల్లించానని, సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నానని చెప్పింది.

First published:

Tags: Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు