రారా.. మెట్రోలోకి రారా..! లెగరా.. సీటులో నుంచి లెగరా..! అంటూ ఓ యువతి మెట్రో ట్రైన్లో చంద్రమూఖి అవతారమెత్తింది. ఎక్కడ జరిగిందో తెలియని ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేం ఓవరాక్షన్ రా బాబు అని కొంతమంది తిట్టుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఈ వీడియో చూస్తూ విరగబడి నవ్వుతున్నారు.
Greater Noida: A girl seen in the metro in the getup of '#Manjulika' from the movie '#BhoolBhulaiyaa' Video is of #Noida Sector 148 metro station#viral2023 #viralvideo #ViralVideos #Indian #india #METRORail pic.twitter.com/IIVt3YNYmJ
— Siraj Noorani (@sirajnoorani) January 24, 2023
చంద్రమూఖి సినిమా గుర్తుంది కదా..? దేశవ్యాప్తంగా వివిధ బాషాల్లో రిమేక్ అయిన ఈ సినిమా.. దాదాపు విడుదలైన అన్ని బాషాల్లోనూ సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మన దగ్గర చంద్రమూఖిగా జ్యోతిక నటిస్తే తమిళ్లో సౌందర్య నటించారు. ఇక బాలీవుడ్లో భూల్ భూలయ్య పేరుతో విడుదలై రికార్డులు సృష్టించింది. అయితే గతేడాది చంద్రముఖి సీక్వెల్‌గా బాలీవుడ్ హర్రర్, కామెడీ చిత్రం భూల్ భూలయ్య-2ను విడుదల చేశారు. ఈ సీక్వెల్ బొమ్మ కూడా అదిరింది. దీంతో అందులోని ముంజులిక క్యారెక్టర్‌కు యమ క్రేజ్ వచ్చిపడింది. సినిమా రిలిజ్ టైమ్‌లో చాలామంది సోషల్‌మీడియాలో ముంజులిక గెటప్ వేసుకోని నానా హంగామా సృష్టించారు.
ఇక ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఓ మంజులిక హడావుడి తెగ వైరల్ అవుతోంది. సినిమాలో ముంజులిక ధరించిన డ్రెస్సు వేసుకోని ఓ యువతి మెట్రో ట్రైన్లో హల్చల్ చేసింది. చంద్రముఖి కాపీ పేస్ట్‌లా.. సేమ్ అచ్చు గుద్దినట్లు చంద్రముఖి గెటప్‌తో ట్రైన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది యువతి. ఆమెను చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ముంజులిక ట్రేడ్ మార్క్ సాంగ్ ప్లే చేస్తూ అక్కడున్నవారిని భయపెట్టే పని చేసింది ఆ యువతి. డూప్లికేట్ ముంజులిక యాక్టింగ్‌కి కొంతమంది పగలబడి నవ్వగా.. మరికొంతమంది మాత్రం విసుక్కున్నారు. ఇక సోషల్‌మీడియాలో మాత్రం ఆమెపై జోకులు పేలుతున్నాయి. ఆస్కార్ యాక్టింగ్ రా ఇది అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే మరికొంతమంది మాత్రం ఇదేం చిల్లర యాక్టింగ్ అంటూ తిట్టిపోస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandramukhi, Metro Train, Social Media, Viral Videos