• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WOMAN DISCOVERED A PENIS SHAPED ISLAND IN THE PACIFIC OCEAN SU

పురుషాంగం ఆకారంలో ఉన్న ఐలాండ్‌ను కనుగొన్న మహిళ.. ఎక్కడో తెలుసా?

పురుషాంగం ఆకారంలో ఉన్న ఐలాండ్‌ను కనుగొన్న మహిళ.. ఎక్కడో తెలుసా?

(Picture Credit: Google Maps)

భూమి మీద మానవులకు తెలియని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రదేశాల గురించి తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం.

  • Share this:
    భూమి మీద మానవులకు తెలియని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రదేశాల గురించి తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. ఇలాంటి అసాధారణమైన, తెలియని గమ్యస్థానాలకు గుర్తించడానికి గూగుల్ మ్యాప్స్ కూడా కొన్నిసార్లు తోడ్పడుతుంటుంది. గూగుల్ మ్యాప్స్ సాయంతో భూమి మీద ఉన్న అనేక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. భూమిపై ఎక్కడ ఏ ప్రదేశం ఉందో ఇంట్లోనే కూర్చొని చూసేయవచ్చు. ఇలానే ఓ మహిళ గూగుల్ మ్యాప్‌లో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో ఓ వింత ప్రదేశాన్ని గుర్తించింది. పురుషాంగం ఆకారంలో ఉన్న ద్వీపాన్ని ఆమె నోటీసు చేసింది. వివరాలు.. అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన 50 ఏళ్ల జోలీన్ వుల్టాగియో గూగుల్ మ్యాప్స్‌లో పసిఫిక్ మహాసముద్రంలోని ట్రినిటీ దీవులలో పురుషాంగం రూపంలో ఉన్న ఓ ద్వీపాన్ని గుర్తించింది. ఈ వింత ప్రదేశం గురించి వెంటనే గూగుల్ ఎర్త్ సూపర్‌ఫ్యాన్స్ అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో షేర్ చేసింది.

    "నేను ట్రినిటీ దీవుల చుట్టూ చూస్తున్నాను. అప్పుడే అక్కడ విచిత్రమైన ప్రదేశం కనిపించింది. సున్తీ చేయని పురుషాంగం రూపంలో ఓ ద్వీపం కనిపించింది" అని జోలిన్ పేర్కొంది. అయితే ఆమె గుర్తించిన ద్వీపంలో మనుషులు నివసిస్తున్నారా? లేదా? అనేది ఇంకా తెలియదు. అయితే ఈ ద్వీపానికి సమీపంలోని ట్రినిటి ద్వీపాని చెందిన ఓవియాలో దాదాపు 3,400 మంది నివసిస్తున్నారు.

    అయితే ఈ విషయాన్నిజోలిన్ ఇతరులతో షేర్ చేయడంతో వారు కూడా ఆసక్తికరంగా ఆ ఫొటోలను చూస్తున్నారు. ఆ ఫొటోలో ద్వీపం చుట్టూ నీలం జలాలతో పాటు పచ్చదనం కూడా ఉంది. ఇక, మీరు కూడా ఆ ద్వీపాని చూడాలంటే.. 20°37’37” S 166°18’02” E గూగుల్ మ్యాప్స్‌లో టైప్ చేసి.. ఆ తర్వాత శాటిలైట్ వ్యూ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు