హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆరేళ్లుగా ప్రియుడితో డేటింగ్.. బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసి తెల్లముఖమేసిన అమ్మాయి.. స్టోరీ మాములుగా లేదుగా..

ఆరేళ్లుగా ప్రియుడితో డేటింగ్.. బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసి తెల్లముఖమేసిన అమ్మాయి.. స్టోరీ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news: ప్రియుడితో కలిసి ఆరేళ్లుగా డేటింగ్ చేస్తుంది. ఇద్దరు ఒకర్ని మరోకరు అర్థం చేసుకున్నారు. కలకాలం కలిసి ఉండాలనుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త, తొలుత స్నేహం ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. అయితే.. ఇద్దరు కలిసి ఆరేళ్లుగా డేటింగ్ లో (love affair) ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లేవారు. ఒకర్నిమరోకరు పూర్తిగా అర్థం చేసుకొవడానికి చాలా కాలం కలిసి ఉన్నారు. అయితే.. అమ్మాయికి, అబ్బాయికి డీఎన్ఏ టెస్ట్ చేయించింది. దీనిలో విస్తూపోయే నిజం వెలుగులోనికి వచ్చింది. దీంతో షాకింగ్ కు గురైన యువతి తన బాధను... రెడ్డిట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా (viral news) మారింది.
అసలేం జరిగిందంటే.. అమ్మాయి, అబ్బాయి ఒకర్ని మరోకరు ప్రేమించుకున్నారు. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే.. ఆమెకు తరచుగా డీఎన్ఏ టెస్టులు చేయించుకుంటుంది. అదే విధంగా.. తన ప్రియుడి జన్యుపరమైన హిస్టరీ కోసం అతనికి కూడా టెస్ట్ చేయించింది. ఈ క్రమంలో వీరుటెస్ట్ లలో విస్తూపోయే నిజం వెలుగులోనికి వచ్చింది. అమ్మాయి, అబ్బాయికి వరుసకు సోదరుడి అవుతాడని రిపోర్టులో బయటపడింది.


దీంతో ఆమె నోటి వెంట మాట రాలేదు. ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె తన బాధను సోషల్ మీడియా (Social media)  ప్లాట్ ఫామ్ వేదికగా పంచు కుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. సదరు యువతి తన బాధను.. రెడ్డిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేందిరా నాయన అంటూ కామెంట్ లు చేస్తున్నారు. భలే.. తిక్క కుదిరింది.. టెస్ట్ లు ఏందుకు చేసుకున్నావ్.. ఇప్పుడు సోదరుడితో ఏలా జీవితం పంచుకుంటావంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా చనిపోయాడకున్న వ్యక్తి తండ్రి, మరల వచ్చాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని (Uttar Pradesh) లఖీంపూర్ ఖేరీలో ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఇంద్రకుమార్ అనే వ్యక్తి, తన తండ్రి రాణాలాల్ కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కోసం పోలీసులు ఎంతగానే గాలించారు. అయితే.. కొన్నిరోజుల తర్వాత.. ఒక అనాథశవం పోలీసులకు లభించింది. అది ఇంద్రకుమార్ తండ్రి పోలీకలు కల్గి ఉంది. దీంతో అతను చనిపోయింది తమ తండ్రి అనుకొని ఇంటికి తీసుకొచ్చాడు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ తర్వాత.. కొన్నిరోజులకు సడెన్ గా స్థానికంగా ఉన్న ఆస్పత్రినుంచి ఫోన్ కాల్ వచ్చింది.
మీ తండ్రి కాలికి తీవ్ర గాయాలయ్యాయని, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరాడని డాక్టర్ లను తెలిపారు. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్న వ్యక్తిని చూశాడు. అయితే.. అక్కడ ఉన్నది తన తండ్రిగా ఇంద్రకుమార్ నిర్ధారించుకున్నాడు. చనిపోయిండనుకున్న తన తండ్రి ఇలా బతికి రావడం పట్ల ఎంతో సంతోషపడ్డాడు. ఆతర్వాత.. తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసిన వ్యక్తి, తమ తండ్రి కాదని, అతను పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, VIRAL NEWS

ఉత్తమ కథలు