Viral Video: జాబ్ దొరికిన ఆనందంలో అమ్మాయి చేసిన పని చూసి పగలబడి నవ్విన బాస్

‘యూ ఆర్ సెలక్టడ్’ అని మేనేజర్ చెప్పగానే ఆమె మనసులో ఆనందం ఉరకలు వేసింది. కానీ బాస్ ముందు ఎగిరితే తోక కట్ చేస్తుందేమో అని ఆందోళన.

news18-telugu
Updated: October 17, 2020, 5:53 PM IST
Viral Video: జాబ్ దొరికిన ఆనందంలో అమ్మాయి చేసిన పని చూసి పగలబడి నవ్విన బాస్
జాబ్ దొరికిన ఆనందంలో డ్యాన్స్ చేస్తున్న యువతి
  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు పోవడమే కానీ, కొత్త ఉద్యోగాలు దొరుకుతున్న సందర్భాలు చాలా అరుదు. అలాంటిదే ఒక యువతికి ఉద్యోగం దొరికింది. ‘యూ ఆర్ సెలక్టడ్’ అని మేనేజర్ చెప్పగానే ఆమె మనసులో ఆనందం ఉరకలు వేసింది. కానీ బాస్ ముందు ఎగిరితే తోక కట్ చేస్తుందేమో అని ఆందోళన. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చింది. అప్పటి వరకు తనలో అణచిపెట్టుకుని ఉన్న ఆనందాన్ని ఇక ఆపలేకపోయింది. పార్కింగ్ స్లాట్ దగ్గర నిలబడింది. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చెక్ చేసింది. ఎవరూ లేరు. ఇక ఆమెలో ఆనందం పెల్లుబికింది. డ్యాన్స్ చేసింది. ఆ యువతి చేసిన డ్యాన్స్‌ను చూడాలే గానీ, ఎంత వర్షించినా వృధానే. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే జార్జియాలో. అక్కడ ది స్పాట్ స్పోర్ట్స్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ అని ఉంది. అందులో జాబ్ ఉందంటే ఇంటర్వ్యూకి వెళ్లింది కాయల్లా జోన్స్. అక్కడ ఉద్యోగానికి సెలక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి పార్కింగ్ ప్రదేశంలో ఇలా డ్యాన్స్ చేసింది.

కాయల్లా జోన్స్ చేసిన డ్యాన్స్ అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. విచిత్రం ఏంటంటే, ఆమె చేస్తున్న డ్యాన్స్ అంతా ఆ బార్ మేనేజర్ కూడా చూస్తూనే ఉంది. తన వద్ద ఉద్యోగానికి వచ్చిన యువతి సెలక్ట్ అయిన తర్వాత ఆనందంతో చేసిన నృత్యం చూసి మేనేజర్ కూడా ఖుషీ అయ్యారు. అనంతరం ఆ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సుమారు 1.3 మిలియన్ల వ్యూస్ సాధించింది. చాలా మంది ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి ట్విటర్, టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో షేర్ చేస్తున్నారు. మొత్తం కలిపి ఇప్పటి వరకు 20 మిలియన్ల వ్యూస్‌ను ఈ వీడియో సాధించిందని సమాచారం.





అలా అలా తాను డ్యాన్స్ చేసిన వీడియో కాయల్లా జోన్స్ ‌కు కూడా చేరింది. ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. ఆ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘నేను ఒట్టేసి చెబుతున్నా. నన్నెవరూ చూడట్లేదు అనుకున్నా.’ అని పోస్ట్ చేసింది. ‘కొన్ని నెలలుగా ఉద్యోగం లేదు. మనం ఎంతోకాలంగా కోరుకుంటున్నది చివరకు దొరికితే ఆ ఆనందం ఎలా ఉంటుంది. అందుకే అలా డ్యాన్స్ చేశా.’ అని తెలిపింది.








View this post on Instagram





WE DID IT! @dakara_spence! WE VIRAL BABY! 🤍✊🏾🖤


A post shared by kay kay 👑✨ (@kalaxxyy_) on






ఆ తర్వాత మేనేజర్, కాయల్లా జోన్స్ ఇద్దరూ కలసిన ఫొటోను పోస్ట్ చేశారు. 2020 సంవత్సరం చాలా మందికి లాగానే జోన్స్‌కు కూడా కష్టాలు తెచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఆమెకు రెండేళ్లుగా ఉండడానికి ఇల్లు కూడా లేదు. గడ్డు జీవితం గడుపుతున్న ఆమెకు ఉద్యోగం దొరక్కానే ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వారిద్దరూ చిన్న సెలబ్రిటీలు అయిపోయారు. దీంతో టీవీల వాళ్లు కూడా వారిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. వారిద్దరూ కలసి ఎలన్ షోలో పాల్గొన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 17, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading