‘డైమండ్ అనుకుంటే డమ్మీ రింగ్ అని తేలింది.. బ్రేకప్ చెప్పమంటారా?’

‘డైమండ్ రింగ్ కొనాలంటే నా జీవితకాలం సరిపోదు. పెళ్లికి మన ప్రేమ ముఖ్యం. డైమండ్ కాదు.’ అని కాబోయే భర్త సలహా ఇచ్చాడట.

news18-telugu
Updated: April 16, 2019, 12:06 PM IST
‘డైమండ్ అనుకుంటే డమ్మీ రింగ్ అని తేలింది.. బ్రేకప్ చెప్పమంటారా?’
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 16, 2019, 12:06 PM IST
ఎంగేజ్ మెంట్ సందర్భంగా తన కాబోయే భర్త తనకు డైమండ్ రింగ్ బహూకరించాడనుకుంటే అది డమ్మీ రింగ్ అని తేలిందని, ఇప్పుడు తాను బ్రేకప్ చెప్పాలనుకుంటున్నానంటూ ఓ యువతి ఓ కాలమిస్ట్‌కు లేఖ రాసింది. ఏం చేయమంటారో సలహా చెప్పాలని కోరింది. దీనిపై తన కాబోయే భర్తను ప్రశ్నిస్తే అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా లైట్ తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు చాలా ఇబ్బందిగా ఉంది. డమ్మీ రింగ్ పెట్టావేంటి? అని నా కాబోయే భర్తను అడిగితే. అతను దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. పైగా డైమండ్ రింగ్ కొనాలంటే నా జీవితకాలం సరిపోదు. పెళ్లికి మన ప్రేమ ముఖ్యం. డైమండ్ కాదు. అయినా రెండూ ఒకేలా ఉన్నాయి కదా. బయటి వాళ్లు ఎవరూ గుర్తించలేరులే’ అని హితబోధ చేశాడట.

ఆ యువతి రాసిన లేఖకు కాలమిస్ట్ కూడా చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ‘పెళ్లి రింగ్‌తో మీ జీవితాన్ని ప్రారంభించాలనుకోవడం లేదు కదా. డైమండ్ రింగ్ తీసుకొచ్చి డమ్మీ రింగ్ అనుకో అని మీ కాబోయే భర్త చెప్పడమే సమస్య. అయినా, తన తాహతు ఏంటో అతను క్లియర్‌గానే చెప్పాడు కదా.’ అని సమాధానం ఇచ్చింది.

ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకుందామనుకుంటున్న విషయం కుటుంబంలోని ఇతర మహిళలకు కూడా తెలిసింది. అయితే, డమ్మీ రింగ్ వల్ల పెద్ద సమస్య లేదని, అసలు అది పెద్ద ప్రాబ్లం కాదు అన్నట్టుగా సలహా ఇచ్చారు. ‘ఇది డైమండ్ రింగ్ అని అతను చెప్పలేదు. నీకు నువ్వుగా అది డైమండ్ రింగ్ అనుకున్నావు. నీ అంచనా తప్పని తేలింది. అందులో అతడిని అనాల్సిన పనేముంది?’ అంటూ కాబోయే పెళ్లికూతురికి సలహా ఇచ్చారట. ‘మరీ ఎంగేజ్‌మెంట్‌కి డైమండ్ రింగ్ ఆశించడం అతిగా లేదూ...’ అని బుగ్గలు నొక్కుకుంటున్నారట.

First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...