WOMAN CONCEIVES A SECOND CHILD WHILE ALREADY PREGNANT IN A RARE DOUBLE PREGNANCY IN UK HERE IS THE DETAILS MS GH
Double Pregnancy: ఇది వైద్యరంగంలోనే అద్భుతం.. మూడు వారాల్లోనే రెండు సార్లు గర్భం దాల్చిన మహిళ
ప్రతీకాత్మక చిత్రం
గత సెప్టెంబర్ నెలలో ఆమె ఇద్దరు కవల పిల్లలతో గర్భం దాల్చింది. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు మగబిడ్డ కాగా, మరొకరు ఆడబిడ్డగా డాక్టర్లు నిర్దారించారు. వీరిద్దరూ మూడు వారాల వ్యవధిలో గర్భం ధరించారు. అయితే, సాధారణంగా కవల పిల్లలు ఒకే రకమైన పోలికలతో జన్మిస్తారన్న విషయం తెలిసిందే.. కానీ..
మహిళ గర్భం దాల్చడం పెద్ద వింత విషయమేమీ కాదు. కానీ.. ఒకే మహిళ రోజుల వ్యవధిలో రెండు సార్లు గర్భం దాల్చడం కచ్చితంగా వింతే. యూకేకు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల రెబెకా రాబర్ట్స్ తన భర్త రైస్ వీవర్(43)తో కలిసి విల్ట్షైర్లోని ట్రోబ్రిడ్జ్లో నివసిస్తుంది. గత సెప్టెంబర్ నెలలో ఆమె ఇద్దరు కవల పిల్లలతో గర్భం దాల్చింది. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు మగబిడ్డ కాగా, మరొకరు ఆడబిడ్డగా డాక్టర్లు నిర్దారించారు. వీరిద్దరూ మూడు వారాల వ్యవధిలో గర్భం ధరించారు. అయితే, సాధారణంగా కవల పిల్లలు ఒకే రకమైన పోలికలతో జన్మిస్తారన్న విషయం తెలిసిందే.. కానీ రాబర్ట్స్ కు జన్మించిన వారిద్దరూ వేర్వేరు పోలికలతో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది వైద్య రంగలో అద్భుతంగా డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఇటువంటి కేసులు నమోదు చేయబడ్డాయని వారు స్పష్టం చేస్తున్నారు.
దీనిపై గర్భం దాల్చిన మహిళ రాబర్ట్స్ మాట్లాడుతూ, “గర్భాదారణ సమయంలో నాకు స్కానింగ్ చేయగా రెండవ పిండం ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనిపించలేదని డాక్టర్లు చెప్పారు. కానీ, ఇప్పుడు నేను కవల పిల్లలకు జన్మనివ్వడం పట్ల ఆశ్చర్యపోతున్నాను. గర్భవతిగా ఉన్నప్పుడు మళ్లీ గర్భం దాల్చడం అనేది నేనెప్పుడూ వినలేదు.” అని పేర్కొంది.
సూఫర్ఫెటేషనే కారణముంటున్న వైద్యులు..
కాగా, గత ఏడాది సెప్టెంబర్లో ఆమె సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కవలలకు ప్రసవించినట్లు సమాచారం. రాబర్ట్స్ కు జన్మించిన ఆడ బిడ్డ రోసాలీ బొడ్డు తాడు సమస్యతో జన్మించినట్లు తెలిసింది. తను పుట్టినప్పుడు 2lb 7oz బరువు మాత్రమే ఉంది. మరోవైపు, రోసాలీ కవల సోదరుడు నోహ్ 4lb 10oz బరువుతో జన్మించాడు. ఇలా, రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడానికి సూఫర్ఫెటేషన్ కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
స్పర్మ్ ద్వారా ఫెర్టిలైజ్ అయిన ఎగ్.. రోజుల తరువాత గర్భంలో ఇంప్లాంట్ జరిగితే రెండు సార్లు గర్భం దాల్చే అవకాశముంటుంది. ఇలా జరగడాన్నే సూఫర్ఫెటేషన్ అంటారు. ఈ మహిళ విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, రాబర్ట్స్ తన భర్త రైస్ వీవర్(43)తో కలిసి నివసిస్తుంది. వీవర్ పిల్లల దుస్తులకు సంబంధించిన ఒక సంస్థను నడుపుతున్నాడు. ఈ దంపతులకు ఇదివరకే సమ్మర్ అనే 14 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. చివరి సారిగా 2016లో ఆస్ట్రేలియా మహిళలో కూడా ఇటువంటి సూపర్ఫెటేషన్ కేసే నమోదైంది. ఆమె కేవలం 10 రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. 10 రోజుల వ్యవధిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.