హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: తనను బిగ్ స్క్రీన్ పై చూపించినందుకు.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్..

Viral Video: తనను బిగ్ స్క్రీన్ పై చూపించినందుకు.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్..

స్టేడియంలో సందడి చేస్తున్న యువతి

స్టేడియంలో సందడి చేస్తున్న యువతి

ఏవైనా పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్(Sports Events) జరుగుతున్నప్పుడు.. బాగా సీరియస్‌గా ఉన్న స్టేడియాన్ని(Stadium) ఉర్రూతలూగించే బాధ్యతలు తీసుకుంటారు కెమెరామెన్లు. ఎవరో ఒకరు చేసే సిల్లీ పనులను బిగ్ స్క్రీన్‌పై చూపించి ప్రేక్షకులను కొత్త మూడ్‌లోకి తీసుకెళ్తుంటారు. సరిగ్గా యూఎస్ ఓపెన్‌లోనూ(US Open) ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఇంకా చదవండి ...

ఏవైనా పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్(Sports Events) జరుగుతున్నప్పుడు.. బాగా సీరియస్‌గా ఉన్న స్టేడియాన్ని(Stadium) ఉర్రూతలూగించే బాధ్యతలు తీసుకుంటారు కెమెరామెన్లు. ఎవరో ఒకరు చేసే సిల్లీ పనులను బిగ్ స్క్రీన్‌పై చూపించి ప్రేక్షకులను కొత్త మూడ్‌లోకి తీసుకెళ్తుంటారు. సరిగ్గా యూఎస్ ఓపెన్‌లోనూ(US Open) ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆట మధ్యలో ఒక మహిళను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు కెమెరామెన్. దీంతో ఆమె ఆనందాన్ని ఆపుకోలేక, తన చేతిలోని బీరు మొత్తాన్ని గుటుక్కున మింగేసి సంబరాలు చేసుకుంది. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఆమెను ప్రోత్సహిస్తూ, నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లోని(New York) ఫ్లషింగ్ మెడోస్‌లో.. ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్, రాబర్టో బౌటిస్టా అగుట్ మధ్య జరిగిన మ్యాచ్‌ మూడో రౌండ్ ఈ ఘటన చోటుచేసుకుంది.

US Open 2021: యూఎస్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో తలపడనున్న టీనేజ్ అమ్మాయిలు

కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పగానే.. స్టేడియం బిగ్ స్క్రీన్‌పై ఆమె కనిపించింది. దీంతో ప్రేక్షకులందరూ తననే చూస్తున్నారనే సంతోషంతో చేతులు పైకెత్తి మరీ సంబరాలు చేసుకుంది. ఆ క్షణంలో అందరినీ అలరించాలని ఆమె నిర్ణయించుకుంది. ఏం చేయాలో అర్థంకాక తన చేతిలో ఉన్న గ్లాసులో బీర్ మొత్తం ఒక్కసారిగా తాగింది. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మరో యూఎస్ ఓపెన్ గేమ్‌లో సైతం ఆమె సందడి చేసింది. మ్యాచ్‌ ఐదు, ఆరో సెట్‌లో కోర్టులోని కెమెరాలు ఆమె వైపు తిరిగాయి. మరోసారి ఆమె స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆమె సంబరానికి హద్దులు లేకుండా పోయాయి.

Shikhar Dhawan-Aesha: శిఖర్ ధావన్ దంపతులు విడాకులు తీసుకున్నారా..? ఇన్ స్టాగ్రామ్ లో అయేషా పోస్టు వైరల్.. పూర్తి వివరాలివే..


ఈసారి పక్కనే ఉన్న తన స్నేహితుడి చేతిలో ఉన్న బీర్ గ్లాసు తీసుకొని, కిందకు దింపకుండా పూర్తిగా తాగి సంబరాలు చేసుకుంది. ఇలా రెండుసార్లు ఆమె బీర్‌ తాగుతూ హల్‌చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టెన్నిస్ కామెంటేటర్ మాట్లాడుతూ.. ఆమె మరోసారి అలాగే చేస్తోందని మైక్‌లో చెప్పారు. ఆమె బీర్ తాగుతూ సంబరాలు చేసుకున్న వీడియోను యూఎస్ ఓపెన్ ట్విట్టర్ పేజీలో 1.5 లక్షల మంది చూశారు.

యూఎస్ ఓపెన్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు వైరల్‌గా మారాయి. 2018 టోర్నీలో ఒక మహిళ కూల్‌డ్రింక్‌లో చికెన్ ముంచుకొని తిన్న వీడియో అప్పట్లో వైరల్‌ అయింది. అయితే ఇలాంటి సందర్భాలతో కొన్నిసార్లు ప్లేయర్లు డిస్ట్రబ్ అవుతుంటారు. అందువల్ల ప్రేక్షకులు కూడా స్టేడియంలో సంయమనం పాటిస్తుంటారు.

First published:

Tags: Us open, Viral Video

ఉత్తమ కథలు