హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: వామ్మో.. చూస్తుండగానే రైలు కింద పడిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో..

Shocking: వామ్మో.. చూస్తుండగానే రైలు కింద పడిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో..

రైలు పట్టాల మీద పడిపోయిన యువతి

రైలు పట్టాల మీద పడిపోయిన యువతి

Viral Video: అర్జెంటీనాలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువతి రైలు కోసం ప్లాట్ ఫామ్ మీద నిలబడింది. రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. ఇంతలో ప్లాట్ ఫామ్ మీద నిలబడిన యువతి ఒక్కసారిగా రైలు కింద పడింది.

Woman Falling Under Moving Train In Argentina:  సాధారణంగా కొంత మంది చిన్న చిన్న కారణాలకే రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు పరీక్షలలో ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో విఫలం చెందామనో రైలుకింద పడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక్కొసారి కొంత మంది అనుకొకుండా పట్టాలు దాటుతూ వెళ్ళేటప్పుడు అనుకొకుండా రైలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

మరికొందరు సెల్ ఫోన్ మాట్లాడుతూ.. పరధ్యానంలో ఉంటు రైలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని సార్లు ప్లాట్ ఫామ్ మీద నిలబడి సెల్పీ పిచ్చితో రైలు కింద పడిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని సార్లు.. అనుకోకుండా ప్లాట్ ఫామ్ దాటేటప్పుడు, రైలు ప్రమాదాలకు గురి అవుతుంటారు. అయితే, ఇక్కడ ఒక మహిళ రైలు ప్లాట్ ఫామ్ మీద నిలబడింది. ఆమెకు ఎదో అసౌకర్యానికి గురైంది. ఆమె కళ్లు తిరిగి ముందుకు తూలింది. అప్పుడు రైలు వేగంగా వచ్చింది. ఆమె రైలుకు ఎదురుగా కిందపడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లోని ఇండిపెటండెన్స్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. క్యాండేలా అనే యువతి రైలు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో రైలురానే వచ్చింది. కానీ ఆమెకు కళ్లు తిరిగి బ్యాలెన్స్ తప్పిపోయి ఏకంగా.. రైలుకు ఎదురుగా వెళ్లి కింద పడింది. ఆమెను మొదట్లో ఎవరు గమనించలేదు. మహిళ.. ట్రైన్ కోసం ముందుకు వెళ్లి నిల్చుందని భావించారు.

కానీ ఆమె కళ్లుతిరిగి బ్యాలెన్స్ తప్పిపోయి కిందపడింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళ కు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు. ఆమె ట్రైన్ కు, ప్లాట్ ఫామ్ కు మధ్య లో ఉండే ఖాళీ స్థలంలో పడింది. రైలు వెళ్లిపోగానే ప్రయాణికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. చిన్న పాటి గాయాలు మాత్రమే అయ్యాయి. మార్చి 29న ఈ ఘటన జరిగింది. ఆమె స్పృహ తప్పి పడిపోతున్నదృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Train accident, Viral Video

ఉత్తమ కథలు