హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : మహాతల్లి..కళ్ల ముందు ఇల్లు తగలబడుతున్నా హాయిగా ఊయల ఊగుతోంది

Viral Video : మహాతల్లి..కళ్ల ముందు ఇల్లు తగలబడుతున్నా హాయిగా ఊయల ఊగుతోంది

కళ్ల ముందు ఇల్లు తగలబడుతుంటే హాయిగా ఊయల ఊగుతున్న మహిళ

కళ్ల ముందు ఇల్లు తగలబడుతుంటే హాయిగా ఊయల ఊగుతున్న మహిళ

Viral Video: సాధారణంగా మన కళ్ల ఎదురు అగ్ని ప్రమాదం జరిగితే మనం.. ఎలా జరిగింది... లోపల ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంటాం. వెంటనే అగ్నిప్రమాదం గురించి ఫైరింజన్‌ కి ఫోన్ చేసి చెబుతాం.

Viral Video: సాధారణంగా మన కళ్ల ఎదురు అగ్ని ప్రమాదం జరిగితే మనం.. ఎలా జరిగింది... లోపల ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంటాం. వెంటనే అగ్నిప్రమాదం గురించి ఫైరింజన్‌ కి ఫోన్ చేసి చెబుతాం. అయితే ఓ మహిళ మాత్రం కళ్ల ఎదురు పెద్ద బిల్గింగ్ తగలబడి పోతున్నా కూడా హాయిగా ఉయలలో ఊగుతూ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో..రష్యా(Russia)లోని కోట్లాస్ అనే పట్టణంలో ఓ నివాస బిల్డింగ్ కి ఎలా అంటుకున్నాయో గానీ మంటలు వచ్చాయి. చూస్తుండగానే చాలా పెద్దగా మారి ఇల్లంతా తగలబడుతోంది. ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపిస్తున్నాయి. కొంతమంది అగ్ని ప్రమాదాన్ని చూస్తూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎమర్జెన్సీ వాహనాలు కూత పెడుతున్నాయి. అయితే ఆ తగలబడుతున్న ఇంటికి అతి దగ్గర్లోనే ఉన్న ఓ పార్క్ లో పిల్లలు ఆడుకునేటువంటి ఓ ఊయలలో ఊగుతూ ఉంది ఓ మహిళ. తన బిడ్డను ఒళ్లో పెట్టుకొని హాయిగా ఊయల ఊగుతోంది ఆమె.


ఆమె అలా ఊయల ఊగుతూ ఉండటం చూసిన ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి వీడియో రికార్డ్ చేశారు. ఓవైపు అంతలా మంటలు వ్యాపిస్తుంటే... ఈమె ప్రశాంతంగా ఊయల ఊగుతోందేంటి అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ట్విట్టర్‌ లో ఏప్రిల్ 26న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. గొప్పదానివమ్మా..మహితల్లి అంటూ నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

First published:

Tags: Russia, Viral Video, WOMAN

ఉత్తమ కథలు