Home /News /trending /

WOMAN CASUALLY CATCHES GROWLING LION AND WALKS DOWN A STREET WILD CLIP GOES VIRAL GH VB

Viral Video: రాత్రి వేళ.. నడిరోడ్డుపై సింహాన్ని లాక్కెళ్లిన మహిళ.. నెట్టింట్లో వైరల్​ అవుతున్న వీడియో..

సింహాన్ని ఎత్తుకెళ్తున్న మహిళ

సింహాన్ని ఎత్తుకెళ్తున్న మహిళ

ఓ సింహం అకస్మాత్తుగా ప్రజలు నివసిస్తున్న వీధిలోకి వచ్చింది. దీంతో, సింహం రోడ్డుపై తిరుగుతుండటాన్ని చూసి జనం హడలెత్తిపోయారు. సింహాన్ని చూసి పరుగులు పెట్టారు. అయితే ఒక మహిళ మాత్రం సింహానికే ఎదురొడ్డి నిలిచింది. ఏకంగా సింహాన్ని తన చేతుల్లోకి తీసుకొని బంధించింది.

ఇంకా చదవండి ...
జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్​ (Viral) అవుతుంటాయి. క్షణాల్లో లక్షలకొద్దీ వ్యూస్​ వచ్చి పడుతుంటాయి. తాజాగా ఇటువంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ సింహాన్ని (Lion) చేతుల్లో పట్టుకొని వీధిలో నడిచిన వీడియో(Video) హల్‌చల్ చేస్తోంది. ఈ క్లిప్పింగ్‌ చూసిన నెటిజన్లు(Netizens) షాకవుతున్నారు. మామూలుగా సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయమేస్తుంది. అటువంటిది, సింహాన్ని చేత్తులతో పట్టుకోవడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటన మిడిల్​ ఈస్ట్​ కంట్రీ కువైట్‌లో (Kuwait) చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ సింహం అకస్మాత్తుగా ప్రజలు నివసిస్తున్న వీధిలోకి వచ్చింది. దీంతో, సింహం రోడ్డుపై తిరుగుతుండటాన్ని చూసి జనం హడలెత్తిపోయారు. సింహాన్ని చూసి పరుగులు పెట్టారు.

Protest: వినూత్నంగా తేనెతుట్టెలతో నిరసన తెలిపారు.. ముగింపు ఇలా ఉంటుందని ఊహించలేకపోయారు..


అయితే ఒక మహిళ మాత్రం సింహానికే ఎదురొడ్డి నిలిచింది. ఏకంగా సింహాన్ని తన చేతుల్లోకి తీసుకొని బంధించింది. అయితే సింహం గర్జిస్తూ ఆమె చేతుల నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించింది. అయినా సరే సింహాన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని లాక్కెళ్లింది. ఈ సన్నివేశాన్ని చూసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే స్థానిక ఎన్విరాన్​మెంటల్​ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటపై విచారణ చేపట్టిన పోలీసులు.. సదరు మహిళనే ఎత్తుకెళ్తున్న సింహానికి యజమాని అని గుర్తించారు. ఆ మహిళ తన ఇంట్లో సింహాన్ని పెంచుకుంటుందని తెలిపారు.

Viral News: నిజంగా జంతు ప్రేమికులు ఇలా ఉంటారా..? వాళ్లు ఏం చేశారో తెలిస్తే మీరు అదే అంటారు..!


సింహాన్ని పెంచుకునే సంప్రదాయం..
కువైట్​లో కొందరు కుక్కలు, పిల్లులనే కాదు సింహం, చిరుత పులులను కూడా పెంచుకుంటారు. అయితే సింహం, పులి వంటి భయంకరమైన వన్య ప్రాణులను పెంచుకోవడం అక్కడ చట్ట వ్యతిరేకం. అయినప్పటికీ కొంత మంది వీటిని సంప్రదాయంగా పెంచుకుంటూనే ఉన్నారు. తరాలుగా వాటిని పెంచుకుంటున్నామని, ఇప్పడు చట్టం చేసినంత మాత్రాన ఆ సంప్రదాయాన్ని వదులుకోలేమని కొందరు చెబుతున్నారు. అందుకే, ఈ జంతువులను పెంచుకునే యజమానులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. అంతే తప్ప, తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మాత్రం వదలడం లేదు.

How to Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..


అయితే ఈ వింత సంప్రదాయంపై పర్యావరణ ప్రేమికులు విరుచుకుపడుతున్నారు. వన్య ప్రాణులను అడవిలోనే వదిలిపెట్టాలని సూచిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కువైట్ సిటీలో ఇలా సింహం వీధుల్లోకి రావడం ఇది మొదటిసారేమీ కాదు. 2013లో ఓ సింహం ఇలాగే వీధుల్లోకి వచ్చి గర్జించింది. స్థానికులు ఎన్విరాన్​మెంటల్​ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు సింహాన్ని పోలీసు వ్యాన్‌లో తీసుకెళ్లి అడవిలో వదిలారు.
Published by:Veera Babu
First published:

Tags: Trending, Video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు