WOMAN CARRYING OLD WOMAN ON HER BACK FIVE KILOMETERS IN GUJARAT POLICE VIDEO GOES VIRAL SNR
Gujarat: మానవత్వాన్ని చాటుకున్న లేడీ కానిస్టేబుల్..ఏం చేసిందో ఈ వీడియో చూడండి
(Photo Credit: Youtube)
Gujarat: గుజరాత్లో ఓ వృద్ధురాలిని ఐదు కిలోమీటర్లు దూరం వరకు మోసుకెళ్లింది ఓ లేడీ పోలీస్. ఆలయానికి వెళ్లిన వృద్ధురాలు అక్కడే సొమ్మసిల్లి పడిపోవడంతో ..అక్కడి నుంచి ఆమెను తన వీపుపై మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసుల్లో చాలా మంది సేవాగుణం కలిగిన వాళ్లే ఉంటారు. ఎక్కడో తులసి వనంలో గంజాయి మొక్కలా అక్కడక్కడ కొందరు పొగరుబోతులు, యూనిఫామ్ చూసుకొని విర్రవీగే వాళ్లు తగులుతారు. ఇంకొందరు ఒంటిపైనున్న ఖాకీ యూనిఫామ్ చూసుకొని రుబాబు చేస్తుంటారు. కాని గుజరాత్ (Gujarat)లో ఓ మహిళ పోలీస్ (Woman Police)చేసిన పనికి సహాయం అనాలో , సేవ అంటే బాగుంటుందో లేక ఉపకారం ఇలాంటి పదాలన్ని చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కచ్ (Kutch) జిల్లాలోని రాపర్ (Rapper)లో ఓ ఆలయం (Templ)eఉంది. అక్కడికి వెళ్లాలంటే చాలా దూరం కాలి నడకన వెళ్లాలి. ఎలాంటి వాహన సౌకర్యం ఉండదు. అలాంటి ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు ఓ వృద్ధురాలు (Old woman)వెళ్లింది. వెళ్లడానికి ఎలాగొలా కష్టపడి వెళ్లింది. కాని అక్కడికి వెళ్లగానే కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడ ఉండటానికి ఎలాంటి సౌకర్యం లేదు. వెనక్కి రావడానికి ఓపిక లేదు. కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలి పరిస్థితి దయనీయంగా ఉండటం గమనించిన ఓ మహిళా పోలీస్ ..అక్కడ డ్యూటీ Dutyచేస్తోంది. వృద్ధురాలు పడుతున్న ఇబ్బందిని గ్రహించింది. ఆమె సాయం చేయాలన్న మంచి ఆలోచనతో తాను ఇబ్బంది పడింది. డ్యూటీలో ఉంటూనే వర్ష పర్మార్ (Varsha Parmar)అనే మహిళ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని తన వీపుపై ఎక్కించుకొని Carry on the backచేతులు మెడకు చుట్టుకొని...సుమారు మంటుడెండలో ఐదు కిలో మీటర్ల (Five kilometers)దూరం వరకు మోసుకుంటూ తీసుకెళ్లింది. ఓ వృద్ధురాలి పట్ల సాటి మనిషిగా, ఓ మహిళగా బాధను అర్ధం చేసుకొని సాయం చేసింది. ఈమె వృద్ధురాలిని మోసుకెళ్తుండగా తోటి పాదాచారులు సెల్ఫోన్లో వీడియో తీస్తుంటే కూడా వద్దని చెప్పింది. తాను మానవత ధృక్పధంతో తన డ్యూటీగా భావించి చేశాను తప్ప ప్రచారం కోసం కాదని ఎలాంటి గుర్తింపు కోసమో అంతకన్న కాదని తెలిపింది కానిస్టేబుల్ వర్ష పర్మార్.
లేడీ పోలీస్ కాదు సూపర్ పోలీస్..
కళ్లు కనిపించని అంధులను చేయి పట్టుకొని రోడ్డు దాటించడానికే ఇబ్బంది పడుతూ తమకెందుకని పక్కకు వెళ్లిపోయే జనం ఉన్న ఈరోజుల్లో ఇలాంటి సేవ గుణం కలిగిన వ్యక్తులు ఉండటం నిజంగా విశేషంగా చెప్పుకోవాలి. లేడీ పోలీస్తో పాటు ఆలయానికి వచ్చిన భక్తులు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. మారుమూల ప్రాంతంలోని మండుటెండలో ఓ వృద్ధురాలిని ఐదు కిలోమీటర్ల దూరం వరకు భుజాలపై మోసుకొని తీసుకెళ్లడం అందులో ఓ మహిళ ఇంతటి సాహయం చేయడాన్ని వీడియోలో చూసిన నెటిజన్లు సూపర్ పోలీస్ అంటూ అభినందిస్తున్నారు.
మానవథృక్పధం..
ఇతరులకు సేవ చేయడంలో తప్పు లేదు. ముఖ్యంగా వృద్ధులు,వికలాంగులు, చిన్నారులు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా సేవ చేయడం వారికి కాస్త ఉపయోగ పడటం మంచి లక్షణం. ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు సేవ చేయడం సాక్షాత్తు ఆ దేవుడికి సేవ చేసిన దాంతో సమానం అని వెనుకటి పెద్దలు చెబుతుంటారు. అందుకే మానవసేవయే మాదవసేవ అన్నారు. గుజరాత్లో ఈ లేడీ పోలీస్ చేసిన సాయం కూడా ఈకోవలోకే వస్తుందని మరికొందరు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.