Home /News /trending /

WOMAN BRINGS BACK SUITCASE WITH 18 SCORPIONS AFTER VACATION IN CROATIA PAH

ఇదేందిరా నాయన.. మహిళ టూర్ వెకేషన్... సూట్ కేస్ లో తేళ్లు.. ఎక్కడంటే...

పాకుతున్న తేళ్లు

పాకుతున్న తేళ్లు

Croatia: మనం సరదాగా టూర్ కు వెళ్లినప్పుడు, అక్కడి మనకు నచ్చినవి జ్ఞాపకాలుగా మన ఇంటికి తెచ్చుకుంటాం. కొందరు వస్తువులు, గిప్ట్ లు తమతోపాటు తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మన పెద్ద వాళ్లు.. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటుంటారు. అది కొన్నిసార్లు ప్రూవ్ అవుతునే ఉంటుంది. ఎవరైన వేకేషన్ లకు, టూర్ లకు వెళ్తే.. అక్కడ స్పెషల్ గా ఉండే వాటిని తమతో పాటు తీసుకొస్తుంటారు. మరికొందరు.. గిఫ్ట్ లను, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ లను తీసుకొస్తుంటారు. మన దగ్గరు దొరకనికి, ఎంచుకొని మరీ జాగ్రత్తగా తీసుకొస్తుంటారు. అయితే.. ఇక్కడో యువతి క్రయోషియాకు టూర్ కు వెళ్లింది. ఆమె తన ఇంటికి తీసుకెళ్లిన దాన్ని చూసి ఇంట్లో వారు.. నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా (viral news)  మారింది.

పూర్తి వివరాలు.. ఆస్ట్రియాలోని (Astria) నాటర్న్ బాచ్ కు చెందిన లింజ్ అనే మహిళ తన సెలవుల్లో క్రయోషియాకు వెళ్లింది. ఆమె అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించింది. అయితే.. ఆమె తన టూర్ ముగించుకుని ఇంటికి చేరుకుంది. అయితే.. ఆమె సూట్ కేసులో కొన్ని తేళ్లను తనతోపాటు ఇంటికి తీసుకెళ్లింది. దీన్ని చూసిన ఇంటిలోని వారు షాక్ కు గురయ్యారు. ఇదేంది అంటూ ఆమెపై మండిపడ్డారు.



వెంటనే ఆమె స్థానికంగా ఉండే ఒక రెస్క్యూ టీమ్ కు తేళ్లను ( scorpions) అప్పగించింది. ఆ తర్వాత.. వారు క్రయోషియా అడవుల్లో వదిలేస్తామంటూ తెలిపారు. కాగా, దాదాపు 2,000 రకాల తేళ్లు ఉన్నాయి. వాటిలో కేవలం 30 నుండి 40 జాతులు మాత్రమే మానవులలో మరణానికి కారణమయ్యేంత బలమైన విషాన్ని కలిగి ఉంటాయి. క్రొయేషియా నుంచి తెచ్చిన స్కార్పియన్స్ ప్రాణాపాయం కాదు. అయినప్పటికీ, వారి కుట్టడం వల్ల చర్మంపై నొప్పి, వాపు మరియు చికాకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా క్వీన్ గార్డు అమ్మాయిలపై చేసిన పని వైరల్ గా మారింది.

కొందరు మహిళలు లండన్ (London) పర్యటనకు వెళ్లారు. అయితే.. అక్కడ బంకింగ్ హమ్ ప్యాలెస్ (Buckingham palace) చూడటానికి వెళ్లారు. అంతే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ప్రదేశాన్ని తమ ఫోన్ లలో బంధిస్తున్నారు. అనేక చోట్ల నిలబడీ మరీ సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతులు.. అక్కడ గుర్రంపై ఉన్న రాయల్ క్వీన్స్ గార్డు (Royal queens guard) దగ్గరకు వెళ్లారు. అక్కడ సెల్ఫీ కోసం దిగటానికి ట్రైచేశారు. ఇంతలో గార్డు గట్టిగా అరిచాడు. దీంతో యువతులు భయంతో వణికిపోయారు.
 గుర్రం పగ్గాలను తాకొద్దంటూ హెచ్చరించాడు. దీంతో వారిద్దరు కూడా దూరంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేందిరా నాయన.. మెల్లగా చెప్పొచ్చుగా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు.. ఇంకొసారి అక్కడికి వెళ్లొద్దంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Scorpio, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు