Woman bites rapist tongue: ఓ మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ దీంతో ఆ మహిళ చేసిన పనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వావ్, మీరు ఎంత ధైర్యం చూపించారు అంటూ ఆమెను పొగుడ్తున్నారు. అసలు ఇంతకీ అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిపై ఆ మహిళ ఏం చేసింది?ఆమెను నెటిజన్లు ఎందుకు ప్రశంసిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రాన్స్‌లోని(France) అవిగ్నాన్ నగరంలో ఇటీవల ఒక మహిళ తన కుక్కను వాకింగ్ కోసమని ఇంటి నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఓ అపరిచితుడు ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ఆమె బట్టలు లాగడం,బలవంతంగా కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఏయే ఏంటి ఎవరు నువ్వు వదులు అంటూ అతనితో తీవ్రంగా గొడవపడింది. అయితే ఆ తర్వాత కూడా అతడు దాడి కొనసాగించడంతో ఆ మహిళ..అతడు తనను ముద్దు పెట్టుకుంటుండగా ముద్దులోనే అతడి నాలుక కోసుకుంది. ఆ తర్వాత అతడు వెంటనే అక్కడి నుంచి జంప్ అయ్యాడు అతడి దాడి నుంచి తప్పించుకున్న మహిళ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన విషయం గురించి పోలీసులకు వివరించింది. అంతేకాకుండా ఆ మహిళ పోలీసుల వద్దకు చేరుకున్నప్పుడు, ఆమె అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తి నాలుక ముక్కను తనతో తీసుకువెళ్లి; సాక్ష్యంగా పోలీసులకు అందించింది.. ఇది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అనంతరం ఆ మహిళపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ మాంసం ముక్కను కూడా తీసుకున్నారు.
Wedding invitation card : అలాంటోళ్లు మా పెళ్లికి రావద్దు..వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: France