సమాజంలో పురుషుల తోడు లేకుండా మహిళ జీవించడం కొంత కష్టమైనా విషయమే. ఈ విషయం వారికి కూడా తెలుసు. పురుషుల అండ, మద్దతు లేకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని అనుకున్నా.. సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తన భర్త మరణించడంతో ఓ మహిళ పురుషుడి వేషంలోకి మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సంవత్సరాలు అదే వేషంలో కొనసాగింది. గుర్తింపు అనేది పేరులోనే కాదు, ప్రపంచం ముందు తన లింగాన్ని కూడా మార్చుకుంది. ఆమె ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పెళ్లైన 15 రోజులకే తన భర్త చనిపోవడంతో తమిళనాడుకు చెందిన ఎస్ పెచ్చియమ్మాళ్ కూడా ఇదే పద్ధతిని కనుగొంది. ఆ సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాలు. ఆమె తన ముందు ఇంకా ఎంతో జీవితం ఉందనే విషయాన్ని గమనించింది.
అయితే తన ముందున్న పరిస్థితిని అధిగమించి ముందుకు సాగడం అంత సులువు కాదని తెలుసుకుంది. అందుకే ఎవరూ ఊహించని విధంగా ఓ అసాధారణమైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోయింది. కటునాయకన్‌పట్టి గ్రామానికి చెందిన నివాసి. కూలీగా పనిచేసింది. తన భర్త మరణించిన తర్వాత టీ దుకాణాల్లో పనిచేసింది, కానీ ఆమె అక్కడ దోపిడీని ఎదుర్కొంది. చివరికి తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి వెళ్లి జుట్టు కత్తిరించుకుని అబ్బాయిలా చొక్కా, లుంగీ కట్టుకోవడం మొదలుపెట్టింది.
గత 20 ఏళ్లుగా ఆమె స్వగ్రామంలో నివసిస్తోంది. అయితే ఆమె ముత్తు కాదు, పెచ్చియమ్మాళ్ అని ఆమె కుమార్తె , కొంతమంది సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదు. మగవాళ్లకు అన్ని పనులు చేస్తూ డబ్బు సంపాదించిన పెచ్చియమ్మాళ్ ముత్తుగా మారి మగవాళ్లు చేసే పనులన్నీ చేసింది. పెయింటర్‌గా, టీ మాస్టర్‌గా, పరాటా మాస్టర్‌గా పని చేస్తూ కొన్నిసార్లు 100 రోజుల ఉపాధి పథకంలో కూడా పనిచేశారు. వీటన్నింటి ద్వారా వచ్చిన డబ్బును తన కూతురి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపయోగిస్తూనే ఉంది.
తన ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా నుంచి ముత్తుగా నమోదు చేసుకుని మగవాడి గుర్తింపుతో జీవిస్తోంది. ఆమె కుమార్తెకు కూడా వివాహమైంది. కానీ ఆమె తన గుర్తింపును లేదా ఆమె దుస్తులను మార్చడానికి సిద్ధంగా లేదు. ఆమె చనిపోయే వరకు తన పురుష గుర్తింపును కొనసాగించాలని కోరుకుంటుంది. తన కూతురి భవిష్యత్తు కోసం వేషం మార్చుకుని సమాజంలో పురుషుడిలా జీవించడం మొదలుపెట్టిన పెచ్చియమ్మాళ్ తీసుకున్న నిర్ణయం కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఇంతకాలం ఆమె పట్టుదలతో పురుషుడిగా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు సాగడాన్ని కొందరు అభినందిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.