హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేం ట్విస్ట్ రా నాయన.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి పోతే... కుక్క కాటు..

ఇదేం ట్విస్ట్ రా నాయన.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి పోతే... కుక్క కాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala: మహిళకు ఇంటి దగ్గర పిల్లి కరిచింది. దీంతో ఆమె గాబారాపడి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ కోసం వెచిచూస్తుంది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

మనం తరచుగా కొన్నిసామెతలు వింటుంటాం. అవి అచ్చం మన జీవితంలో జరిగే సంఘటనలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరగ్గానే మనకు నవ్వోస్తుంది. కొన్నిసార్లు బాధగా కూడా ఉంటుంది. మనకు జరిగిన సంఘటనలను నేరుగా చెప్పకుండా.. కొందరు సామెతల రూపంలో కూడా చెబుతుంటారు.. అయితే.. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంటారు.’.., ‘నీడ కోసం చెట్టు కిందకు వెళ్లి నిల్చుంటే చెట్టు కొమ్మలు ఊడిపోయి తలమీదపడ్డట్లు..’.. అని చెబుతుంటారు.  అయితే.. ఈ కోవకు చెందిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది.

అసలేం జరిగిందంటే.. కేరళలో (kerala) ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరువనంతపురానికి చెందిన విళింజమ్ ప్రాంతానికి చెందిన అపర్ణ అనే మహిళకు శుక్రవారం ఇంటి దగ్గర ఒక పిల్లి (Cat bite) కరించింది. అయితే.. ఆమె వెంటనే తన సబ్బుతో కాలును క్లీన్ చేసుకుంది. ఆతర్వాత... దగ్గరలోని ప్రభుత్వ క్లినిక్ కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ అపర్ణ, తన తండ్రితో కలిసి తన వంతు వచ్చే వరకు అక్కడే ఉన్న బెంచ్ మీద వేచి చూస్తున్నారు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

అపర్ణ కూర్చున్న బెంచీ కింద ఒక కుక్క కూర్చుని ఉంది. ఆమె కాలు పొరపాటున కుక్క తోకపై పడింది. దీంతో కుక్క.. బాధతో కుయ్ అంటూ అరుస్తూ..  ఆమె కాలిని కరిచి (Dog bite) గాయపర్చింది. వెంటనే ఆమె భయపడిపోయింది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె కాలును సబ్బుతో కడుక్కొమని చెప్పి, కట్టు కట్టి.. మరో ఆస్పత్రికి పంపించారు. దీంతో పాపం... ఆమె అసలే.. పిల్లి కరిచిందని బాధలో ఉండగా, ఇప్పుడు దానికి తోడు కుక్క కూడా కరిచింది. మహిళ తెగ భయపడిపోతుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా అడవిలో క్రూర జంతువులు, ఇతర జంతువులను వేటాడి తింటుంటాయి.

సింహాలు, పులులు, చిరుతపులులు వేటాడి ఇతర జంతువులను తింటాయి. క్రూర జంతువుల బారి నుంచి తప్పించుకొవడానికి సాధు జంతువులు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో క్రూర జంతువుల బారిన పడి సాధు జంతువులు వాటికి ఆహారంఅయిపోతే.. మరికొన్నిసార్లు మాత్రం క్రూర జంతువులకే, ఇతర జంతువులు చక్మా ఇచ్చి తప్పించుకుంటాయి. ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.తాజాగా, మరో వీడియో వైరల్ గా (viral video)  మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో చిటారు కొమ్మన కోతి ఎక్కికూర్చుంది. దాన్ని వేటాడుతూ మరో పెద్దపులి చెట్టుమీదకు ఎక్కింది. పెద్ద పులి పైకి ఎక్కిన కొలది.. కోతి దానికి అందకుండా తెగ ప్రయత్నాలు చేస్తుంది. కోతి కడుపుకు ఒక పిల్లకూడా కన్పిస్తుంది. అయితే.. పెద్దపులి ఎంత ప్రయత్నం చేసిన కోతిని మాత్రం పట్టుకోలేకపోయింది.చివరకు పాపం.. అది బ్యాలెన్స్ తప్పి.. చెట్టుమీద నుంచి నెల మీదకు పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) పెద్దపులికి చుక్కలు చూపిస్తున్న కోతి వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే తప్పించుకుంది..,’, ‘కోతి లక్ బాగా ఉన్నట్టుంది.. ’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Cat, Kerala, Stray dogs, VIRAL NEWS

ఉత్తమ కథలు