హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : బెంచి మీద కూర్చుందని మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో వైరల్

Viral Video : బెంచి మీద కూర్చుందని మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో వైరల్

Woman Arrested (Photo : Youtube)

Woman Arrested (Photo : Youtube)

Viral Video : బ్రిటన్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రైన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తూ గత బుధవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

ఇంకా చదవండి ...

  బ్రిటన్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రైన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాక్ డౌన్ ను విధించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తూ గత బుధవారం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నింబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ సారి హెచ్చరించటం.. వినకపోతే ఫైన్‌ వేయటం.. అప్పటికీ వినకపోతే అరెస్ట్‌ చేయటం మొదలుపెట్టారు. శనివారం సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఓ వ్యక్తికి 200 స్టెర్లింగ్‌ పౌండ్ల ఫైన్‌ వేశారు. ప్రీతీ పాటెల్‌ అనే మహిళను హెచ్చరించి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  ' isDesktop="true" id="719468" youtubeid="bRmwvqQ8vEo" category="international">

  ఈ కొత్త వైరస్ మహమ్మారి దాదాపు 40కి పైగా దేశాల్లో బయటపడింది. అయితే మొదట యూకేలో ఈ వైరస్ మూలాలను గుర్తించారు. అలా అది అమెరికా, భారత్, వియత్నాం, టర్కీ ఇలా పలు దేశాల్లో విస్తరిస్తోంది. అయితే, అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి కారణమైన యూకే ప్రయాణికులను గుర్తించడం, ఐసోలేషన్‌కు తరలించడం వంటి చర్యలను ఆయా దేశాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా వివిధ దేశాల్లో మరికొన్ని రకాల కొత్త వైరస్‌లు వ్యాప్తిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ వైరస్ వెలుగులోకి వచ్చింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Corona, Lock down, Trending, UK Virus, Viral Video

  ఉత్తమ కథలు