Magic Trick : జాదూ కా షో చూడడానికి ఎవరు ఇష్టపడరు? మాంత్రికుడు(Magician)చూపే రకరకాల ట్రిక్స్ చూసి పిల్లలైనా, పెద్దలైనా అందరూ ఆశ్చర్యపోతారు కానీ ఆ ట్రిక్(Trick) రహస్యాన్ని కనిపెట్టగలిగే వారు చాలా తక్కువ. మ్యాజిక్ లు ఎలా ప్రదర్శించబడుతున్నాయో తెలుసుకోవాలని చాలా వారు కోరుకుంటారు. ప్రస్తుతం ట్విటర్లో ఒక వీడియో ట్రెండింగ్లో ఉంది. 'నెక్స్ట్ లెవల్ స్కిల్స్' అనే ట్విటర్ ఖాతాలో మ్యాజిక్(Magic) గేమ్ ఆడుతున్నట్లుగా కనిపించే విచిత్రమైన ఈ వీడియో ఇటీవల పోస్ట్ చేయబడింది. ఆ వీడియోలో నల్లటోపీ పెట్టుకున్న ఓ మెజీషియన్ మ్యాజిక్ చేస్తూ కనిపిస్తాడు. నల్ల గుడ్డ చేతిలో పట్టుకొన్న ఆ మెజీషియన్ కి ఎదురుగా నల్లని కుర్చీ కనిపిస్తుంది. మెజీషియన్ తన చేతిలోనినల్లటి గుడ్డ తీసుకుని ఆ కుర్చీపై పెట్టాడు. కొన్ని సెకన్లలో అతను గుడ్డను తీసివేయగా ఒక అందమైన అమ్మాయి కుర్చీలో కూర్చుని ఉంది.
వేలల్లో వ్యూస్ వచ్చిన ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కామెంట్ సెక్షన్ లో మెజీషియన్ రహస్యాన్ని నెటిజన్లు బయటపెట్టారు. గుడ్డ కుర్చీపై పడినప్పుడు దాని నుండి అమ్మాయి బయటకు వస్తున్న తలుపును మీరు చూస్తారు... కుర్చీలో ప్రత్యేక ప్యానెల్ తయారు చేయబడిందని ఒకరు చెప్పారు. అమ్మాయి బయటకు వచ్చిన కుర్చీలో ఒక కంపార్ట్మెంట్ ఉందని ఒక నెటిజన్ చెప్పారు.
మరోవైపు,యూఎస్ లో (United states) వింత ఘటన చోటు చేసుకుంది. జార్జీయాలోని అట్లాంటాలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. అట్లాంటాకు చెందిన డామియా విలియమ్స్ అనే యువతి సోషల్ మీడియాలో అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయింది. చివరకు ఆమె ఒక కఠిన నిర్ణయానికి వచ్చింది. తను పెళ్లంటు చేసుకుంటే.. 50 ఏళ్లు పైబడిన వారినే చేసుకుంటానని నిర్ణయించుకుంది. అంతేకాకుండా.. తన జీవితంలో అవసరాలు తీర్చేవారిని, జీవితంలో వేల్ సెటిల్ అయిన వారిని పెళ్లిచేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమెకు.. డామియా జేమ్స్ అనే 67 ఏళ్ల పెద్దాయనతో 2017 లో పరిచయం ఏర్పడింది. క్రమంలో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
???? pic.twitter.com/oKakyoeWpm
— Next Level Skills (@SkillsLevel) September 12, 2022
Husband Sell Wife Kidney : భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండానే అమ్మి మరో పెళ్లి చేసుకున్న భర్త!
ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. షాపింగ్ లు, షికార్లు ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలో... వీరి మనస్సుల ఒకటి కావడంతో 2018లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత.. పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో, జేమ్స్ ఆమెతో కలిసి వెళ్లే వరకు ఆమె స్వంతంగా నివసించే ఇంటిని జేమ్స్ కొనుగోలు చేశాడు. అంతే కాకుండా ఒక కారును కూడా ఆమె తిరగటానికి కొనిచ్చాడు. తామిద్దరికి వయసులో గ్యాప్ ఎక్కువగా ఉన్న మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నామని జేమ్స్ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. డామియా, జేమ్స్ కు ఏ లోటు లేకుండా చూసుకునే వాడు. అతనికి 67 సంవత్సరాలు ఉండవచ్చు.. కానీ అతను చాలా చురుకుగా ఉంటాడు, ఇప్పటికీ అధిక శక్తిని కలిగి ఉన్నాడు" అని డామియా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీరి పెళ్లి న్యూస్ (Wedding news) కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video