హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

(Image-Twitter)

(Image-Twitter)

చీర కట్టు భారత దేశ సంప్రదాయంలో(Indian Tradition) ఒక భాగం. చీరకట్టును విదేశాల్లో కూడా గౌరవిస్తారు. విదేశీ మహిళలు కూడా చీరకట్టులో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు.

చీర కట్టు భారత దేశ సంప్రదాయంలో(Indian Tradition) ఒక భాగం. చీరకట్టును విదేశాల్లో కూడా గౌరవిస్తారు. విదేశీ మహిళలు కూడా చీరకట్టులో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. చీరకట్టుకు అంతటి ప్రాధాన్యత ఉంది. అలాంటిది మనదేశంలోనే కొందరు చీరకట్టును అవమానించేలా వ్యవహరించిన ఘటనలు ఒకటి రెండు చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చీర (Saree) కట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు.. చేదు అనుభవం ఎదురైంది. చీరకట్టుకున్నందుకు ఆమెను రెస్టారెంట్‌లోని అనుమతించలేదు. ఈ ఘటన ఇప్పుడు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్‌కు చీరకట్టులో వచ్చిన తనను అక్కడి సిబ్బంది లోనికి రానీయకుండా అడ్డుకున్నట్టుగా మహిళ చెప్పారు. చీర స్మార్ట్, క్యాజువల్‌ డ్రెస్ కోడ్ కిందకు రాదని సిబ్బంది తనతో అన్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటనతో విసుగు చెందిన జర్నలిస్ట్ అనిత చౌదరి (Anita Chaudhary) ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అక్విలా రెస్టారెంట్‌లో(Aquila Restaurant) ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెప్పారు. ‘అక్విలా రెస్టారెంట్‌లోనికి చీర కట్టుతో అనుమతించలేదు. ఎందుకంటే చీర అనేది స్మార్ట్ ఔట్ ఫిట్ కాదని వారు చెప్పారు. దయచేసి నాకు Smart outfit అర్ధం చెప్పండి’అని అనిత చౌదరి ట్వీట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసేపుడు అనితా చౌదరి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah), కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి (Hardeep Singh Puri), ఢిల్లీ పోలీస్ కమిషనర్‌, మహిళా కమిషన్‌ని (Women Commission) కూడా ట్యాగ్ చేసింది.

Mutton Curry: హ్యాపీగా దావత్ చేసుకుంటున్నారు.. మటన్ ముక్కల విషయంలో గొడవ.. కట్ చేస్తే..
అలాగే తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో కూడా దీనిపై స్పందించారు. ‘నిన్న నా చీర కారణంగా జరిగిన అవమానం ఇప్పటివరకు నాకు జరిగిన ఇతర అవమానాల కంటే చాలా పెద్దది. ఇది నా హృదయాన్ని కలచివేసింది. నాకు పెళ్లి జరిగింది. నేను చీర ధరించే పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. నాకు కుటుంబం ఉంది. నాకు చీర కట్టుకుంటే చాలా ఇష్టం. నేను చీరను ఇష్టపడే వ్యక్తిని. నేను భారతీయ వస్త్రధారణను, సంస్కృతిని ఇష్టపడతాను. చీర చాలా అందమైన ఫ్యాషన్, అందమై వస్త్రధారణ అని నేను నమ్ముతాను. కానీ దేశంలోని కొన్ని చోట్ల చీరను స్మార్ట్ వేర్‌గా పరిగణించడం లేదు. నేను చీర కట్టుకోవడం మానేయాలంటే.. స్మార్ట్ దుస్తులకు అసలైన నిర్వచనం ఏమిటో చెప్పండి’అని ఆమె యూట్యూబ్‌ వీడియోలో కోరారు.


ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చీరకట్టుకోవడమనేది భారతీయ సంస్కృతి అని.. అయితే ఇలా చీరకట్టుకున్న మహిళను అమమానించడం ఏమిటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో రెస్టారెంట్ యజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. అటువంటి రెస్టారెంట్స్, మాల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published:

Tags: Delhi, Viral Video

ఉత్తమ కథలు