Home /News /trending /

Woman Marriages: ఆమె వయసు 52 ఏళ్లు.. స్కూల్ అయిపోగానే తొలి పెళ్లి.. ఇప్పటివరకు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..

Woman Marriages: ఆమె వయసు 52 ఏళ్లు.. స్కూల్ అయిపోగానే తొలి పెళ్లి.. ఇప్పటివరకు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman Marriages: మోనెట్‌ హైస్కూల్ పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె చిన్నతనంలో తన సోదరుడి స్నేహితులను చాలా ఇష్టపడింది. వారిని వివాహం చేసుకోవాలని భావించింది.

    మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో గుర్తింపు ఉంది. అందుకే మన వివాహ వ్యవస్థను ప్రపంచమంతా ఎంతగానో గౌరవిస్తుంది. అయితే ప్రపంచంలోని పలు దేశాలు వివాహ వ్యవస్థను అంత సీరియస్‌గా తీసుకోవు. అందులో అమెరికా కూడా ఉంది. అందుకే అక్కడ వివాహం చేసుకున్న వాళ్లు విడిపోవడం.. మళ్లీ తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అయితే అక్కడ 52 ఏళ్ల ఓ మహిళ ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకుంది. మోనెట్ అనే ఈ మహిళ కొత్త భర్తలతో జీవించడానికి ఎంతగానో ఇష్టపడుతుంది. ఆమె ఇప్పటివరకు 9 మంది భర్తలను 11 సార్లు వివాహం చేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 52 సంవత్సరాలు ఉన్నా.. ఆమెకు పెళ్లిళ్లలపై ఆసక్తి, ఇష్టం తగ్గలేదు.

    ఇంకా మోనెట్ కొత్త వరుడి కోసం ఆమె వెతుకుతూనే ఉంది. మోనెట్‌ హైస్కూల్ పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె చిన్నతనంలో తన సోదరుడి స్నేహితులను చాలా ఇష్టపడింది. వారిని వివాహం చేసుకోవాలని ఊహించింది. తన కలను నెరవేర్చుకోవడానికి, హైస్కూల్ పూర్తి చేసిన వెంటనే వివాహం చేసుకుంది.

    అప్పటి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మోనెట్ 9 వేర్వేరు పురుషులను 11 సార్లు వివాహం చేసుకుంది. మోనెట్ వివాహాలు ఏవీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పటి వరకు తనకు 28 మంది నుంచి పెళ్లి ప్రతిపాదనలు అందాయని మోనెట్ తెలిపారు. వివాహం విచ్ఛిన్నం కావడం వల్ల తాను నిరుత్సాహపడలేదని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది.

    KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

    ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    తన భర్తల గురించి ఆమె మాట్లాడింది. తన 5వ భర్త ఉత్తమమని, 6వ నంబర్ భర్త మంచి స్వభావం కలిగి ఉన్నాడని చెప్పింది. ఆమె ఎనిమిదో నంబర్ భర్తను ఆన్‌లైన్‌లో కలుసుకుందని.. పదో నంబర్ భర్త ఆమెకు చిన్నప్పటి నుండి తెలుసని వెల్లడించింది. ప్రస్తుతంఆమె 57 ఏళ్ల జాన్‌తో డేటింగ్ చేస్తోంది. ఇంతకు ముందు రెండుసార్లు పెళ్లి చేసుకున్న తర్వాత జాన్‌ను విడిచిపెట్టింది. త్వరలోనే అతడిని 12వ వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు