Shocking: గత ఏడాది కాలంగా సెక్స్ చేయలేదు.. అయితే డాక్టర్స్ అలా చెప్పేసరికి..

(Image Credit: @gibson_sammi/Tiktok)

ఏడాదికి పైగా ఎవరితోనూ శారీరక సంబంధం లేకుండా ఉన్న మహిళ‌తో వైద్యులు గర్భం దాల్చవని చెప్పారు. దీంతో ఆమె షాక్ తింది.

  • Share this:
    ఏడాదికి పైగా ఎవరితోనూ శారీరక సంబంధం లేకుండా ఉన్న మహిళ‌తో వైద్యులు గర్భం దాల్చవని చెప్పారు. దీంతో ఆమె షాక్ తింది. ఏడాది పాటు తాను ఎవరితో సెక్స్ చేయకుండా ఇలా జరగడమేమిటని ఆశ్చర్య పోయింది. వైద్యులు చెప్పిన మాటలతో పూర్తిగా అయోమయంలో పడింది. సమంత గిబ్సన్ అనే బ్రిటీష్ మహిళకు ఈ వింత అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వీడియో ద్వారా టిక్‌టాక్‌లో పంచుకుంది. డాక్టర్లు చెప్పిన మాటలు తనకు భయం కలిగించాయని కూడా తెలిపింది. ఈ మేరకు The Sun ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలు.. బ్రిటీష్ మహిళ సమంతా గిబ్సన్(Samantha Gibson) తనకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లింది.

    అక్కడ ఆమెకు బ్లెడ్ టెస్ట్‌లు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని (pregnant) చెప్పారు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. తాను ఒక ఏడాదికి పైగా సెక్స్ చేయనప్పుడు(not having sex for over a year) వైద్యులు గర్భవతి అని ఎలా చెప్పారో తెలియక షాక్ తింది. దీని గురించి ఎవరికైనా సమాచారం ఉంటే దయచేసి తనకు తెలియజేయండి అని ఆమె వీడియోలో చెప్పారు. వీడియోలో సమంత మాట్లాడుతూ.. ‘కొద్ది రోజుల క్రితం నేను రక్త పరీక్ష కోసం డాక్టర్‌ని కలిశాను. నాకు మైకముగా ఉంటం, కడుపులో తీవ్రమైన నొప్పి కలగటంతో డాక్టర్ల వద్దకు వెళ్లాను. నేను వారానికి రెండు లేదా మూడు సార్లు కడుపులో నొప్పిని అనుభవించాను. కానీ పరీక్ష తర్వాత.. డాక్టర్ మాటలు నన్ను షాక్‌లోని నెట్టాయి’అని చెప్పింది.

    Saidabad Rape Case: పక్కింట్లో ఉండే పాపపై అత్యాచారం, హత్య చేసి పరార్.. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?

    సమంత షేర్ చేసిన ఈ వీడియోను టిక్‌టాక్‌లో(TikTok) 1 మిలియన్స్ కంటే వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసి ప్రజలు కూడా షాక్ తిన్నారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని చూశారు. సెక్స్ చేయకుండా ఆమె ఎలా గర్భం దాల్చిందని ఆశ్చర్యపోయారు. ఇక, ఇందుకు సంబంధించి రెండో వీడియోను షేర్ చేసిన సమంత.. ‘డాక్టర్లు నా రక్త పరీక్ష వేరొకరి రక్తంతో కలిపి ఉంటారని నేను అనుకుంటున్నాను’అని చెప్పింది.

    Anganwadi Worker: ఆమె ఓ అంగన్‌వాడీ వర్కర్.. కానీ ఆమె ఆస్తులు చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే..

    రెండో వీడియోలో సమంత మాట్లాడుతూ.. ‘నేను గర్భం దాల్చే అవకాశమే లేదని డాక్టర్లకు చెప్పాను. ఎందుకంటే వాస్తవానికి నేను ఏడాదికిపైగా సెక్స్‌లో పాల్గొనలేదు. అందుకే గర్భం దాల్చడమనేది అసాధ్యం. దీంతో డాక్టర్లు నాకు స్ట్రిప్ టెస్ట్ చేశారు. అది నెగిటివ్‌ వచ్చింది. దీంతో డాక్టర్లు ముందు జాగ్రత్తగా మరొసారి రక్త పరీక్ష చేస్తామని చెప్పారు. నేను ఇంకా ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ నెలలు గడిచినప్పటికీ డాక్టర్ల నుంచి నాకు ఫోన్ కాల్ రాలేదు. అయితే నేను మళ్లీ డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే నా కడుపులో నొప్పి ఇంకా అలానే ఉంది’అని తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: