భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’ గురించి తెలుసు కదా..! అమితాబ్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమా అది. జయదేవ్ పాత్రలో అమితాబ్ నటనకు యావత్ దేశం ఫిదా అయిపోయిన చిత్రమది.. అందులో అమితాబ్ నటించలేదు.. జీవించారు. స్నేహితుడు వీరుగా ధర్మేంద్ర అదరగొట్టారు. సినిమా విడుదలై 47ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ చిత్రం గురించి సినీ ప్రజలు చర్చించుకుంటునే ఉంటారు. 'నివురు గప్పిన నిప్పు' లాంటి ఈ సినిమాలో స్నేహితులుగా అమితాబ్, ధర్మేంద్ర పాత్రలను సినీలోకం ఎప్పటికీ మరవదు..! ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అనుకుంటున్నారా..? దానికి కారణం మన క్రికెట్ వీరుడు హార్దిక్ పాండ్యా. అవును..పాండ్యా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది సరే కానీ.. అసలు పాండ్యాకు, షోలే సినిమాకు సంబంధమెంటనుకుంటున్నారా..? పాండ్యా ట్విట్టర్‌లో ఏం ట్వీట్ చేశాడు..? ఫోటోలో పాండ్యాతో ఎవరున్నారు..? ఎందుకా పోస్ట్ వైరల్ అవుతోంది..?
Sholay 2 coming soon ???? pic.twitter.com/WixkPuBHg0
— hardik pandya (@hardikpandya7) January 26, 2023
ధోనీ+పాండ్యా = అమితాబ్+ధర్మేంద్ర :
టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. కెప్టెన్ కూల్ ధోనీతో కలిసి ఉన్న ఫోటో అది. రేపు న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఫైట్ ఉంది. రాంచీ వేదికగా కివీస్, భారత్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రేపటి మ్యాచ్ ఆడేందుకు నిన్న రాత్రే టీమిండియా రాంచీకి చేరుకుంది. రాంచీ ధోనీకి సొంతూరు కావడంతో పాండ్యా ఈ మాజీ ఆటగాడిని కలిసేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంటిలోని బైక్ గ్యారేజీ సెంటర్‌లో అతనితో కలిసి ఓ ఫోటో దిగాడు. ఇప్పుడదే నెట్టింట తెగ షేర్ అవుతోంది. ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు కదా...! అందులోనూ ఇద్దరు కలిసి ఇచ్చిన ఫోజ్ సినీ లవర్స్‌నూ కట్టిపడేసింది. ఓ బైక్‌కి సైడ్‌కార్‌లో ధోనీని ఎక్కించుకున్న పాండ్యా..దాని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. షోలే-2 ఇజ్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతే ఈ ఫోటో నిమిషాల్లో వైరల్ ఐపోయింది.
సేమ్ టు సేమ్:
షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర ఓ పాటలో సేమ్ ఇలానే బైక్‌పై వెళ్తారు. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే..ఇక్కడ మన పాండ్యా కూర్చున్నాడు. పక్కన సైడ్‌కార్‌లో సినిమాలో అమితాబ్ కూర్చుంటే ఇక్కడ ధోనీ కూర్చున్నాడు. ఈ ఫోటోను చూసిన క్రికెట్, సినీ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Dhoni, Hardik Pandya, MS Dhoni