Divorced Couple Remarriage: విడాకులు తీసుకున్న భార్యాభర్తలకు .. హైకోర్టు జోక్యంతో మళ్లీ పెళ్లి.. పూర్తి వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్న దంపతుల(Couples) సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. బిడ్డల పరిస్థితి గురించి కూడా ఆలోచించకుండా ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఈ జంటలను కలపలేక విడాకులు మంజూరు చేస్తున్నాయి. కానీ గుజరాత్ హైకోర్టు (Hishcourt) మాత్రం ఓ నిబంధన ప్రకారం ఇప్పటికే విడాకులు (Divorce) పొందిన ఒక జంటను కలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్న దంపతుల(Couples) సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. బిడ్డల పరిస్థితి గురించి కూడా ఆలోచించకుండా ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఈ జంటలను కలపలేక విడాకులు మంజూరు చేస్తున్నాయి. కానీ గుజరాత్(Gujarath) హైకోర్టు (Hishcourt) మాత్రం ఓ నిబంధన ప్రకారం ఇప్పటికే విడాకులు (Divorce) పొందిన ఒక జంటను కలిపింది. ఒక జంటకు మళ్లీ పెళ్లి చేసి వారి కుటుంబ భవిష్యత్తును కోర్టు మార్చేసింది. పటాన్ జిల్లాకు చెందిన ఒక మహిళ 7 నెలల క్రితం తన భర్తకు విడాకులు(Divorce) ఇచ్చింది. తరువాత తన ఇద్దరు పిల్లలను తనకే అప్పజెప్పాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేసింది.

తాజాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు (Highcourt) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు (Future) కోసం దంపతులిద్దరికీ మళ్లీ పెళ్లి జరిపించడంలో ముఖ్యపాత్ర పోషించింది. వివరాల్లోకి వెళితే.. పటాన్ జిల్లా (Patan District) కు చెందిన ఒక మహిళ కుండమార్పిడి విధానం ప్రకారం ఒక వ్యక్తిని పెళ్లి (Marriage) చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు.. భర్త చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు.

Airlines: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే విమాన టికెట్.. ఎలా పొందాలంటే..

అంతా బాగానే ఉందన్న సమయంలో ఆమె సోదరుడు తన భార్యతో గొడవ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ దంపతుల మధ్య ఏర్పడిన గొడవలు బాధిత మహిళ వివాహ బంధంపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో ఆమె అక్కడి ఆచారాల ప్రకారం భర్త నుంచి విడాకులు తీసుకుంది. కానీ పిల్లలు భర్త కస్టడీలోనే ఉండటంతో, వారి సంరక్షణ బాధ్యత తనకు ఇవ్వాల్సిందిగా కోర్టు మెట్లెక్కింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వినీత్ కొఠారి, జస్టిస్ ఉమేశ్ (Umesh) త్రివేదిల ధర్మాసనం హెబియస్ కార్పస్ పిటిషన్‌ (Hebiyas Carpus Rit) ను విచారించింది.

Organ Donation: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..

పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం దంపతుల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు గుజరాత్ హైకోర్టు ధర్మాసనం సిద్ధమైంది. ఐక్యం కావాలని ఇరు వర్గాలను ధర్మాసనం అభ్యర్థించింది. ఈ భార్యాభర్తలను మళ్ళీ కలిపేందుకు కోర్టు.. పటాన్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (Authority) కేసును మధ్యవర్తిత్వానికి రిఫర్ చేసింది. పిటిషనర్‌ సోదరుడి వివాహాన్ని కూడా నిలబెట్టేందుకు హైకోర్టు పట్టుబట్టింది. మధ్యవర్తిత్వం తరువాత దంపతులిద్దరూ తమ విడాకుల పత్రాలను రద్దు చేయడానికి అంగీకరించారు.

Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

అనంతరం దంపతులు తమ కుటుంబ సభ్యులు, సంఘంలోని నాయకులను సంప్రదించి జనవరి 15న విడాకుల రద్దు పత్రాలను నోటరీ చేయించారు. అయితే ఆగస్టు (August) 23న తాము విడాకుల పత్రాలను రద్దు చేశామని తెలిపిన దంపతులు.. కుటుంబ సభ్యులు, లీగల్ సర్వీస్ అథారిటీ (Legal Service Authority) సిబ్బంది సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు.

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..

అలాగే తమ పిల్లల సంరక్షణ విషయంలోని వివాదానికి ముగింపు పలికారు. కాగా, మంగళవారం ఈ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలిసి హైకోర్టు(Hish Court) హర్షం వ్యక్తం చేసింది. అలాగే భార్యభర్తలిద్దరూ మళ్ళీ వివాహం చేసుకునేలా కృషి చేసిన లీగల్ సర్వీస్ అథారిటీ, మధ్యవర్తుల ప్రయత్నాలను ప్రశంసించింది. దంపతుల వివాదం సుఖాంతం కావడంతో పిటిషన్ ను కొట్టివేసింది.
Published by:Veera Babu
First published: