WINTER SOLSTICE 2021 EVERYTHING TO KNOW ABOUT THE SHORTEST DAY AND LONGEST NIGHT OF THE YEAR MKS GH
Winter Solstice 2021: డిసెంబర్ 21.. ఏడాదిలో సుదీర్ఘమైన రాత్రి.. ఎందుకో, దీని ప్రాధాన్యం తెలుసా?
డిసెంబర్ 21సుదీర్ఘమైన రాత్రికి కారణాలు, విశేషాలివే
ఈ ఏడాదిలో డిసెంబర్ 21, 2021న.. అంటే ఈరోజు భూమి అత్యంత సుదీర్ఘమైన రాత్రిని చూడబోతుంది. సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులను అనుభవించడానికి భూమి అటు, ఇటుగా వంకరగా తిరగడమే కారణం. ఇంకా దీని విశేషాలేవంటే..
భూ ప్రపంచం పై ప్రతి ఏటా రెండు సార్లు కాలవిభేదాలు ఏర్పడటం సర్వసాధారణమే. అత్యంత సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ సమయం గల పగటి పూట ఏడాదికోసారి వస్తుంటుంది. అయితే ఈ ఏడాదిలో డిసెంబర్ 21, 2021న.. అంటే ఈరోజు భూమి అత్యంత సుదీర్ఘమైన రాత్రిని చూడబోతుంది. అలాగే ఈ రోజు అత్యంత తక్కువ సమయం గల పగటిపూటని భూమిపై చూడవచ్చు. భూమి తన చుట్టూ తాను, అలాగే సూర్యుని చుట్టూ భ్రమించడంతో పాటు బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. బొంగరంలా తిరిగేటప్పుడు భూమి ధ్రువం తన అక్షం నుంచి కొన్ని డిగ్రీలతో సూర్యుడికి దూరంగా వంగుతుంది. భూమి ధ్రువం ఎప్పుడైతే భానుడికి దూరంగా గరిష్ఠంగా వంగుతుందో అప్పుడు దక్షిణాయనం(winter solstice) ఏర్పడుతుంది. దక్షిణాయనం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు భూమిపై ఎక్కువగా పడవు. అందువల్ల భూమిపై ఎక్కువ రేపు రాత్రి సమయాన్ని అనుభవిస్తాం. అలాగే పగటిపూట అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణాయనం అనేది చలికాలానికి సూచిక.
ఒకసారి ఉత్తర అర్ధగోళంలో.. ఒకసారి దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి వైపుకు తిరగడం.. సూర్యుడి వైపు కాకుండా మరో వైపు వంగడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా రెండు సార్లు జరుగుతుంది. అయితే సూర్యుని వైపు వంగి ఉంటే పగటి సమయం ఎక్కువగా.. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఉత్తర దక్షిణ ధ్రువాల చుట్టూ ఉన్న దేశాలు సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులను అనుభవించడానికి భూమి అటు, ఇటుగా వంకరగా తిరగడమే కారణం.
ఉత్తర అర్ధగోళంలో మనం దక్షిణాయనం అనుభవిస్తాం. సాధారణంగా ఇది డిసెంబర్ 21 లేదా 22న వస్తుంది. దక్షిణ అర్ధగోళంలో మనం ఉత్తరాయణం అనుభవిస్తాం. సాధారణంగా ఇది జూన్ 20 లేదా 21 న సంభవిస్తుంది. ఈ రెండు అయనాలు ఆరు నెలల చొప్పున ఉంటాయి.
*చారిత్రక ప్రాముఖ్యత
పురాతన కాలంలో ప్రజలు దక్షిణాయనాన్ని సూర్యుని మరణం, పునర్జన్మగా అభివర్ణించారు. ఈ సమయంలో పండుగలు జరుపుకొంటారు. భారతదేశంలో ఈ కాలంలో అనేక పండుగలు జరుగుతాయి. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి జనవరిలో ప్రవేశిస్తాడు. ఈ రోజును మకర సంక్రాంతిగా భారతీయులు ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన మొదటి రోజును సూచిస్తుంది. ఇది శీతాకాలం ముగింపు, సుదీర్ఘ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో సూర్యకిరణాల తీవ్రత భూమిపై ఎక్కువ అవుతుంది. ఫలితంగా పగటిపూట సమయం పెరుగుతుంది.
*ఈ పదం మూలం ఏంటి?
శాస్త్రీయంగా దక్షిణాయన సమయంలో సూర్యుడు భూమి క్షితిజానికి(earth horizon) చాలా తక్కువ ఎత్తులో ఉంటాడు. అదే ఎత్తులో సూర్యుడు ఉదయిస్తున్నట్లు, అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. లాటిన్లో అయనాంతం/అయనం(solstice) అనే పదానికి 'సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు' అని అర్థం. భూమికి సూర్యుడు నిశ్చలంగా లేనప్పుడు వాతావరణంలో మార్పులు వస్తుంటాయి అలాంటప్పుడు దక్షిణాయనం, ఉత్తరాయణం ఏర్పడుతుంటాయి. దక్షిణాయనాన్ని హైమల్ అయనాంతం హైబర్నల్ అయనాంతం, బ్రూమల్ అయనాంతం అని కూడా అంటారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.