మందు బాబులకు షాక్.. ఆ రోజు మద్యం అమ్మరు!

సైబరాబాద్‌ పరిధిలో 23వ తేది ఉదయం 6 గంటల నుంచి 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్‌లు, బార్లు మూసివేసే ఉంచాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.

news18-telugu
Updated: May 21, 2019, 1:07 PM IST
మందు బాబులకు షాక్.. ఆ రోజు మద్యం అమ్మరు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడటమే తరువాయి. రిజల్ట్స్ ఎంత తొందరగా వస్తాయా? అని ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23వ తేదీ కోసం ఉత్కంఠగా ఉన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు మందుబాబులకు నిరాశ మిగుల్చుతోంది. ఫలితాలు విడుదల కాబోతున్నందున ఆ రోజు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. ఫలితాలు వెలువడనున్నందున దేశవ్యాప్తంగా ఉన్న వైన్‌షాప్‌లు సహా స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్‌లలో నిర్వహించే బార్లు మూతపడనున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలపై నిషేధం విధించనున్నాయి.

ఇక, సైబరాబాద్‌ పరిధిలో 23వ తేది ఉదయం 6 గంటల నుంచి 24 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్‌లు, బార్లు మూసివేసే ఉంచాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైన్‌షాప్‌లు, బార్ల నిర్వాహకులను హెచ్చరించారు. అదీకాక, బహిరంగ ప్రదేశాలలో బాణసంచా కాల్చడంపైనా అధికారులు నిషేధం విధించారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>