Home /News /trending /

WILL NOT FORGET THE BETRAYAL AADITYA THACKERAY AMID SHIV SENA REVOLT PAH

‘మహారాష్ట్ర సంక్షోభం’.. కీలక వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే..

ఆదిత్య ఠాక్రే (ఫైల్)

ఆదిత్య ఠాక్రే (ఫైల్)

Maharashtra: మహారాష్ట్ర లో తీవ్ర రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి విరుద్ధంగా మంత్రి ఏక్ నాథ్ షిండే చేసిన తిరుగుబాటు తీవ్ర దుమారంగా మారింది.

కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే , సొంత పార్టీకి విరుద్ధంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇప్పటికే ఆయన తన వైపు.. ఎక్కువ మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. అదే విధంగా మరికొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కూడా తెలిపారు. దీంతో మహా రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. దీనిపై మఖ్య మంత్రి తనయుడు.. ఆదిత్య థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సత్యానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న యుధ్దమన్నారు.

తిరుగు బాటు ఎమ్మెల్కేలు, సొంత పార్టీకి ద్రోహం చేయడం ప్రజలు ఎప్పటికి మరిచిపోరని అన్నారు. మరోసారి శివసేన తప్పని సరిగా గెలుస్తుందని ఆదిత్య ఠాక్రే అన్నారు. కాగా, ఉద్దవ్ క్యాబినేట్ మంత్రి.. థానె కు చెందిన ఏక్ నాథ్ షిండే తిరుగు బాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రధానంగా మహావికాస్ అఘాడీ.. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలసి ఉండటాన్ని వ్యతిరేకించారు. ఇప్పటి దాక.. షిండేకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. వారంతా.. అస్సాంలోని గౌహతిలోని హోటల్ లో ఉన్నారు.

ఇదిలా ఉండగా  శివసేనతో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నివారించడానికి పార్టీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

శివసేప పార్టీ..  తన క్యాడర్‌ను ఐక్యంగా ఉంచడానికి చివరి ప్రయత్నంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackrey) శుక్రవారం బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కౌన్సిలర్ల సమావేశానికి పిలిచారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం, ఉద్ధవ్ ఠాక్రే శివసేన అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీ క్యాడర్ ఎవరి వైపు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కువ మంది శివసేన(Shiv Sena) ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) శిబిరానికి వెళ్లడంతో అందరి దృష్టి శివసేన కార్పొరేటర్లతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశంపైనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల తర్వాత శివసేనలో తదుపరి పెద్ద చీలిక BMC కార్పొరేటర్ల మధ్య ఉండబోతోందని ఓ ప్రచారం జరుగుతోంది. అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న బీఎంసీ ఎన్నికలపై శివసేన ప్రభావం ఉంటుందని, ఇది పార్టీకి మరింత నష్టం కలిగించవచ్చని కూడా శివసేన నేతలు పేర్కొంటున్నారు.

బీఎంసీని 1989 నుండి శివసేన ఏలుతోంది. పార్టీ నిజమైన శక్తి దేశంలోని అత్యంత సంపన్నమైన పౌర సంస్థ అయిత బీఎంసీపై దాని నియంత్రణ కారణం వస్తోంది. శివసేన, బీజేపీ వర్గాలు థానే, కళ్యాణ్-డోంబివిలి, ఉల్హాస్‌నగర్‌లలో ఏక్‌నాథ్ షిండే ఆధిపత్యం చెలాయించగా, నవీ ముంబై బీజేపీ కంచుకోటగా ఉంది. కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో ఇప్పటికీ ఉండగలిగే ఏకైక కార్పొరేషన్ బీఎంసీ మాత్రమే. బీఎంసీలో 84 మంది ఎన్నికైన కౌన్సిలర్లు ఉన్నారని, అది 99కి పెరిగిందని శివసేన నాయకుడు ఒకరు చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, Politics, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు