మూగ జీవాలకు ప్రాణం పోస్తున్న పర్యావరణ ప్రేమికుడు... వైరల్ వీడియో...

ఎవరైనా తమకోసం తాము జీవించడం కామన్. ఇతరులకు సాయపడుతూ జీవిస్తే... అందులో ఉండే కిక్కు ఎందులోనూ దొరకదంటే ఆశ్చర్యం అక్కర్లేదేమో.

news18-telugu
Updated: June 23, 2020, 2:20 PM IST
మూగ జీవాలకు ప్రాణం పోస్తున్న పర్యావరణ ప్రేమికుడు... వైరల్ వీడియో...
మూగ జీవాలకు ప్రాణం పోస్తున్న పర్యావరణ ప్రేమికుడు...(credit - facebook)
  • Share this:
ఇప్పుడు మనం ఓ మంచి వార్తను తెలుసుకుందాం. మనోజ్ గొగోయ్. మనలాగే మంచి వ్యక్తి. అసోం... కజిరంగాలో పర్యావరణ ప్రేమికుడు. ఎప్పుడూ మూగజీవాల్నికాపాడుతూ... వాటికి సేవలు చేస్తూ... బతికేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో... 18 పక్షుల్ని వేర్వేరు ఆపదల నుంచి కాపాడాడు. అడవిలో తిరుగుతూ అనారోగ్యాల బారిన పడే ఎన్నో రకాల జంతువుల్ని కాపాడి... వాటికి అన్ని రకాల సేవలూ చేస్తున్నాడు. వాటికి తన ఇంటి దగ్గరే నివాసాల్లాంటివి ఏర్పాటు చేసి... అవి స్వేచ్ఛగా బతికేలా చేస్తున్నాడు. జనరల‌గా మనుషుల్ని చూడగానే వామ్మో అనుకుంటూ పారిపోయే ఎన్నో మూగజీవాలు... మనోజ్ గొగోయ్‌ని చూస్తే మాత్రం... పరుగెత్తుకొస్తున్నాయి. అంతలా వాటితో ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకున్నాడు.

మూగ జీవాలకు ప్రాణం పోస్తున్న పర్యావరణ ప్రేమికుడు...(credit - facebook)


మనోజ్ ఇంటి చుట్టూ ఉడుతలు, పక్షులు, అరుదైన పిల్లులు, పందులు, ఇలా పేర్లు కూడా తెలియని ఎన్నో ప్రాణులు హాయిగా జీవిస్తున్నాయి. వాటన్నింటికీ అతనంటే ఎంతో ఇష్టం. విషపూరితమైన పాములు కూడా అతనంటే ఎక్కడలేని ఇష్టం చూపిస్తాయి.

మనోజ్ గొగోయ్... ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన వ్యక్తి. అంతర్జాతీయంగా వన్యప్రాణుల ప్రేమికుడిగా ఫేమస్. అతని ఫేస్ బుక్ అకౌంట్‌లోని నెటిజన్ల కామెంట్లలో ఎప్పుడూ క్లాప్సే కనిపిస్తాయి.

మనోజ్ గత 15 ఏళ్లుగా మూగజీవాల్ని కాపాడుతున్నాడు. అతను కాపాడిన వాటిలో చాలా వరకూ ఆకలితో ఉంటూ మృత్యువుతో పోరాడుతున్నవో... లేక తల్లికి దూరమై మిస్సింగైనవో ఉండేవి. అలాంటి అన్నింటినీ కాపాడి... తన ఇంటినే ఓ చిట్టడవిలా మార్చేశాడు. మనోజ్ తల్లి కూడా అతని జంతు ప్రేమను చూసి ఎంతో ఆనందపడుతున్నారు.
ఇంకో విశేషమేంటంటే... మనోజ్ తను కాపాడే ప్రతీ జీవికీ... పేరు పెట్టాడు. ఎప్పుడు ఏ పేరుతో పిలిస్తే... ఆ పేరు గల జీవి అతని దగ్గరకు వస్తుంది. వాటికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు.

ఆ ప్రాణుల లాగే మనం కూడా ప్రకృతి లోంచీ వచ్చిన వాళ్లమే. కాంక్రీట్ భవనాల్లో దొరకని ఆనందం, సంతృప్తి ప్రకృతిలో ఉన్నప్పుడు దొరకడానికి కారణం అదే. అందువల్ల మనం ప్రకృతికి దగ్గరవుతూ ఉండాలే తప్ప దూరం అవ్వొద్దని సూచిస్తున్నాడు మనోజ్ గొగోయ్.
First published: June 23, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading