• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • WILD SHEEP WITH 35 KG COAT OF WOOL RESCUED IN AUSTRALIA WATCH VIRAL VIDEO SK

Viral Video: గ్రహాంతర జీవి కాదు..గొర్రె.. బొచ్చుతో అన్నీ ఇన్నీ కష్టాలు కాదు..

Viral Video: గ్రహాంతర జీవి కాదు..గొర్రె.. బొచ్చుతో అన్నీ ఇన్నీ కష్టాలు కాదు..

అడవి గొర్రె

సాధారణంగా గొర్రెలకు ఏడాదికి ఒకసారి ఉన్ని కత్తిరించాల్సి ఉంటుంది. లేదంటే ఉన్ని పెరిగిపోతూనే ఉంటుంది. దాదాపు ఐదేళ్లు ఉన్ని కత్తిరించకుండా ఉండటంతో అడవి గొర్రెకు 35.4 కిలోలు పెరిగింది.

  • Share this:
    అది ఆస్ట్రేలియాలోని విక్టోరియా. లాన్స్‌ఫీల్డ్ ప్రాంతంలో ఓ వ్యక్తికి ఒంటి నిండా బొచ్చుతో ఒక జీవి కనిపించింది. చూడడానికి అదేదో గ్రహాంతరవాసిగా ఉంది. అతడు భయం భయంగానే దగ్గరకు వెళ్లాడు. కానీ పూర్తిగా దాని దగ్గరకు వెళ్లాక తెలిసింది.. అది అడవి గొర్రె అని..! శరీరంపై భారీగా పెరిగిపోయిన ఉన్నిని మోయకలేక అల్లాడిపోయింది. దానికి మట్టి, ముళ్లు, ఇతర వస్తువులు అంటుకొని అంధ విహీనంగా కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీకి సమాచారం అందించాడు. వారు చేరుకొని గొర్రెను సంరక్షణా కేంద్రానికి చేర్చారు.

    ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ సభ్యులు గొర్రెకు ఉన్నిని కత్తిరించారు. కత్తిరించిన ఉన్నిని తూం వేస్తే 35 కిలోలుగా తేలింది. దాదాపు ఒక కంగారు బరువుకు సమానం. అంత బరువున్న ఉన్నితో అది ఇన్నాళ్లు ఎంతలా అల్లాడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. చివరకు ఉన్ని మొత్తాన్ని నీట్‌గా కట్ చేసి.. శుభ్రంగా స్నానం చేయించారు. అప్పటి వరకు లావుగా, అంధవిహీనంగా ఉన్న ఆ అడవి గొర్రె.. ఇప్పుడు క్యూట్‌గా మారిపోయింది. తెల్లగా మెరిసిపోతోంది. దానికి బారక్ అని పేరుపెట్టారు. అడవి గొర్రెకు ఉన్ని కత్తిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    సాధారణంగా గొర్రెలకు ఏడాదికి ఒకసారి ఉన్ని కత్తిరించాల్సి ఉంటుంది. లేదంటే ఉన్ని పెరిగిపోతూనే ఉంటుంది. దాదాపు ఐదేళ్లు ఉన్ని కత్తిరించకుండా ఉండటంతో అడవి గొర్రెకు 35.4 కిలోలు పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో గొర్రెలు జీవించడం కష్టం. కానీ ఈ అడవి గొర్రె ఎలా బతికి ఉందో అర్ధం కావడం లేదని ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ సభ్యులు తెలిపారు. కాగా, 2015లో ఇలాగే ఓ అడవి గొర్రెకు ఏకంగా 42 కిలోల ఉన్నిని కత్తిరించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు