Home /News /trending /

WILD LIFE VIDEO GROUP OF LIONS SURROUNDED RHINO AND TRY TO ATTACK BUT FINALLY THIS HAPPENED WATCH SRD

Viral Video : తగ్గేదే లే.. ఖడ్గమృగంతో పెట్టుకుంటే సింహాలైనా సరే మడతడిపోద్ది..!

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : సింహం అల్లంత దూరాన ఉందంటే.. ఇటు నుంచే ఇటే పారిపోతాయి ఇంతర జంతువులు. ఒకవేళ సింహం వేటాడితే.. ఆ రోజు ఏదో ఒక జీవికి అడవిలో నూకలు చెల్లినట్లే భావించాలి. మరి అలాంటి అడవి రాజు.. మరో అడవి జంతువుకు భయపడటం ఎప్పుడైనా చూశారా?

    సోషల్ మీడియా(Social Media) లో ప్రతి రోజూ వందలాది వీడియోలు వైరల్ (Viral Videos) అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలైతే చాలా అందంగా ఉంటాయి. కొన్ని జంతువుల చేష్టలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని జంతువుల ప్రవర్తన అత్యంత భయానకంగా ఉంటుంది. అలాంటిదే ఈ వీడియో. సాధారణంగా అడవికి రాజు ఎవరు అంటే టక్కున సింహం (Lion) అని చెబుతాం. ఎందుకంటే.. సింహ మంత బలమైన, ధైర్యమైన జంతువు అడవిలో మరొకటి లేదు. సింహాన్ని చూస్తే అడవిలోని ఏ జీవికైనా హడలే.

    సింహం అల్లంత దూరాన ఉందంటే.. ఇటు నుంచే ఇటే పారిపోతాయి ఇంతర జంతువులు. ఒకవేళ సింహం వేటాడితే.. ఆ రోజు ఏదో ఒక జీవికి అడవిలో నూకలు చెల్లినట్లే భావించాలి. మరి అలాంటి అడవి రాజు.. మరో అడవి జంతువుకు భయపడటం ఎప్పుడైనా చూశారా? కొన్నిసార్లు మాత్రం సింహాలకూ చుక్కలు చూపించే జంతువులు తారసపడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో (Trending Videos) అలాంటిందే. ఖడ్గమృగం మీద దాడి చేసేందుకు వెళ్లిన సింహాలకు చివరకు చుక్కలు కనపడ్డాయి.

    సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో ఓ ఖడ్గమృగం నీటి కుంట వద్ద సేదతీరుతూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని సింహాలు దూరం నుంచి దాన్ని గమనిస్తుంటాయి. అదును చూసి ఒక్కసారిగా దాని మీదకు దూకేస్తాయి. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడ్డ ఖడ్గమృగం.. కాసేపు తడబడుతుంది. ఓ సింహం దాని మీదకు దూకి కిందపడేయాలని ప్రయత్నిస్తుంది.








    View this post on Instagram






    A post shared by Lion (@lion_kings1)





    అయితే ఖడ్గమృగం మాత్రం అలాగే కాస్త ముందుకు వెళ్లి, దాన్ని గట్టిగా విదిలిస్తుంది. తర్వాత మరికొంత దూరం ముందుకు వెళ్లి తిరిగి సింహాల మీదకు దూసుకొస్తుంది. ఒక్కసారిగా మూడు సింహాలు చుట్టుముట్టినా భయపడకుండా.. ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఖడ్గమృగం దగ్గరికి వెళ్లేందుకు కూడా సింహాలు భయపడతాయి.

    ఇది కూడా చదవండి : ఈజిప్ట్ మమ్మీ శాపం వల్లే టైటానిక్ మునిగిపోయిందా..? లేదా వాళ్లు దాడి చేశారా..?

    ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సింహాలకు బాగానే బుద్ధి చెప్పిందంటూ చమత్కరిస్తున్నారు. యే బిడ్డా ఇది నా అడ్డా అంటూ ఖడ్గ మృగం రెచ్చిపోయిందిగా అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Lions, Trending videos, Viral Video

    తదుపరి వార్తలు