Wikipedia: కష్టాల్లో వికీపీడియా.. ఆర్థిక సహాయం చేయండంటూ విజ్ఞప్తి..!

Wikipedia: ఏ సమాచారాన్నైనా అందించగలిగే ఈ మార్గదర్శిని.. వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఎలాంటి లాభాన్ని ఆర్జించకుండా సేవలు అందిస్తున్న ఈ వెబ్‌సైట్ తొలిసారిగా భారతీయులకు ఓ విజ్ఞప్తి చేసింది. ‘విజ్ఞాన ప్రియులారా..’ అంటూ మొదలు పెట్టి ఓ భావోద్వేగ పూరిత సందేశాన్ని రాసింది.

news18-telugu
Updated: August 29, 2019, 5:21 PM IST
Wikipedia: కష్టాల్లో వికీపీడియా.. ఆర్థిక సహాయం చేయండంటూ విజ్ఞప్తి..!
ప్రతీకాత్మక చిత్రం (Photo: reuters)
news18-telugu
Updated: August 29, 2019, 5:21 PM IST
వికీపీడియా.. ఇంటర్నెట్ పుస్తక గ్రంథాలయం. ఏ సమాచారాన్నైనా రాసేందుకు, వాడుకొనేందుకు, అవసరమైన మార్పులు చేర్పుల చేసేందుకు వీలయ్యే డిజిటల్ లైబ్రరీ ఇది. ఓ మంచి స్నేహితుడిలా, మార్గదర్శిలా వ్యవహరిస్తూ బోలెడంత సమాచారాన్ని అందిస్తోంది. ఎన్నో సైన్సు ప్రాజెక్టుల రూపకల్పనకు, పరీక్షల్లో పాసయ్యేందుకు తోడ్పాటునందిస్తోంది. ప్రపంచంలోని ఏ సమాచారాన్నైనా మన ముందు ఉంచుతున్న ఈ మార్గదర్శిని.. వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఎలాంటి యాడ్‌లను అనుమతించకుండా కేవలం విరాళాలతోనే నడుపుతోంది. ఎలాంటి లాభాన్ని ఆర్జించకుండా సేవలు అందిస్తున్న ఈ వెబ్‌సైట్ తొలిసారిగా భారతీయులకు ఓ విజ్ఞప్తి చేసింది. ‘విజ్ఞాన ప్రియులారా..’ అంటూ మొదలు పెట్టి ఓ భావోద్వేగ పూరిత సందేశాన్ని రాసింది.

ఆ సందేశంలో ఏం ఉందంటే.. ‘ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ, మా తరఫున ఒక విన్నపం. వికీపీడియా ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనికి యాడ్స్ లేవు. షేర్ హోల్డర్స్ లేరు. కేవలం దాతలు మాత్రమే ఉన్నారు. కేవలం దాతలు, రీడర్ల విరాళాలతోనే నడుస్తోంది. చిన్న స్టాఫ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సేవలు అందిస్తోంది. రీడర్లు నేర్చుకోవడానికి, అనుసరించడానికి కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. అయితే, ఈ యజ్ఞం ఇలాగే కొనసాగేందుకు, భవిష్యత్తు తరాలకు ఈ సమాచారాన్ని భద్రంగా అందించేందుకు మీ నుంచి సహాయాన్ని అర్థిస్తోందీ వెబ్‌సైట్. కనీసంగా రూ.150 అందజేసి భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా కొనసాగేందుకు, వెబ్‌సైట్ మనుగడ సాగించేందుకు తోడ్పాటునందించగలరని మనవి. ఈ మొత్తం ఒక సినిమా టికెట్‌తో సమానం. కాబట్టి సహాయం చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొంది.
వికీపీడియా చేసిన విజ్ఞప్తి ఇదీ..


కాగా, అతి తక్కువ విరాళాలతో వికీపీడియా నడుస్తోందని వికీమీడియా ఫౌండేషన్ 2015లో ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఆ విరాళాలతోనే వెబ్‌సైట్‌ను, దాని అనుబంధ లింకులను భద్రంగా, వేగంగా అందుబాటులో ఉంచేలా చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడిటర్లకు జీతాలు కూడా ఇందులో నుంచే ఇస్తున్నట్లు వెల్లడించింది.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...