పెళ్లి చేసుకొని..భార్యకు తెలియకుండా మరో యువతితో తిరుగుతున్న భర్త ఆటకట్టించింది మహిళ. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని కాన్పూర్(Kanpur)లో ఈ ఘటన జరిగింది. ఆరేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నభార్య(Wife)ను వదిలి వేరే యువతితో తిరుగుతున్నాడు ఓ వ్యక్తి..భర్త(Husband)ఇంటికి రాకుండా..పట్టించుకోకుండా తిరుగుతున్న విషయం మొదటి భార్యకు తెలియడంతో అతనిపై ఓ కన్నేసి ఉంచింది. వేరే కాపురం పెట్టాడన్న అనుమానంతో అతడ్ని ఫాలో అవుతోంది. భార్యకు తెలియకుండా ప్రియురాలి(Girlfriend)తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న వ్యక్తిని బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నడిరోడ్డుపై పట్టుకుంది. బైక్‌పైన వేరే యువతిని కూర్చొబెట్టుకొని తీసుకెళ్తుండగా అడ్డుకొని నడిరోడ్డుపై భర్త బండారాన్ని బయటపెట్టింది. బైక్‌పై వెళ్తున్న జంటను ఐదారుగురు మహిళలు అడ్డుకొని గట్టిగా నిలదీయడంతో రోడ్డుపై వెళ్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయి సెల్ఫోన్ల(Phone recording)లో ఫ్యామిలీ పంచాయితీని వీడియో(Video)తీశారు. కట్టుకున్న భర్త తనను వదిలి వేరే యువతి వెంట వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయిన మహిళ బైక్(Bike)పై కూర్చున్న యువతిని కిందకు దింపి చెంపలు పగలగొట్టింది. ఆమెతో గొడవపడింది. ఇంతలో భర్త ఆమెను ఎందుకు కొడుతున్నావని అడగటంతో అక్కడున్న మరికొందరు మహిళలు కూడా అతనిపై తిరగబడ్డారు. పెళ్లి చేసుకున్న భార్యకు అన్యాయం చేసి వేరే మహిళతో తిరగడమే కాకుండా ఇంకా అడ్డుచెబుతావా అంటూ తిట్టిపోశారు. అక్కడికి వచ్చిన యువకులు, రోడ్డుపై వెళ్తున్న వాళ్లు కూడా వివాహిత బాధ ఆలకించి భర్తకు చివాట్లు పెట్టారు.
ప్రియురాలితో బైక్‌పై షికారు..
కట్టుకున్న భార్యకు ద్రోహం చేసి వేరే యువతితో కలిసి తిరగడం ఎంత వరకు కరెక్ట్ అని వ్యక్తిని ప్రశ్నించారు స్థానికులు. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే ఇలాగే వీడియోలు తీసి..సోషల్ మీడియాలో పెట్టాలని..అలాగే పోలీసులకు అప్పగించాలని బాధితురాలికి సలహాలు ఇచ్చారు. ఇంత జరుగుతున్న ప్రియురాలితో పట్టుబడిన వ్యక్తిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోగా...రోడ్డుపై పట్టుకొని నానా యాగీ చేస్తావా ఏం చేసుకుంటావో చేసుకో పో అంటూ భార్యను బెదిరించడం వీడియోలో రికార్డైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video