Home /News /trending /

WIFE PRESENTED HER HUSBAND A COLLECTION OF ALL THE WOMEN PHOTOS HE HAS LIKED ON INSTAGRAM SSR GH

భర్తకు ఊహించని వాలెంటైన్ గిఫ్ట్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భార్యామణి..

గ్లోరియా షేర్ చేసిన గిఫ్ట్

గ్లోరియా షేర్ చేసిన గిఫ్ట్

ప్రేమికుల రోజున ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ప్రేమికులకు, భార్యాభర్తలకు అలవాటే. అలా తన భర్తకు నమ్మశక్యం కాని గిఫ్ట్ ఇచ్చింది ఓ భార్యామణి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన భార్యామణి కామెంట్ సెక్షన్‌లో...

ఇంకా చదవండి ...
ప్రేమికుల రోజున ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ప్రేమికులకు, భార్యాభర్తలకు అలవాటే. అలా తన భర్తకు నమ్మశక్యం కాని గిఫ్ట్ ఇచ్చింది ఓ భార్యామణి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన భార్యామణి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్లు పోటెత్తాయి. ఈ మహిళకు వచ్చిన అద్భుతమైన ఆలోచనకు తిరుగే లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఇది దారుణం అంటూ ఆమె ఐడియాను విమర్శించేస్తున్నారు. ఇంతకీ ఆవిడ ఏం చేసిందనే కదా మీ అనుమానం. సింపుల్ .. తన భర్తకు నచ్చిన అమ్మాయిలందరి ఫొటోలను ఆయనకు వాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసేసింది అంతే. ఎంతైనా V-డే అంటే ఆ మాత్రం క్రియేటివిటీ ప్రదర్శించకపోతే ఎలా? అంటూ సెటైర్లు కూడా పెద్ద ఎత్తున పేలుతున్నాయి.

గ్లోరియా అనే టిక్ టాక్ యూజర్ తన భర్తకు ఓ వింత గిఫ్ట్ ని అందించడంతో పాటు ఆ గిఫ్ట్ ని చూపిస్తూ టిక్ టాక్ వీడియో రికార్డ్ చేసి దాన్ని పోస్ట్ చేసింది. మీరంతా మీ భాగస్వాములకు ఎలాంటి బహుమతులు అందిస్తున్నారో పోస్ట్ చేస్తున్నారు కదా.. నేను కూడా నా భర్తకు ఇవ్వబోయే గిఫ్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా.. అంటూ ఆమె ఆ గిఫ్ట్ ని చూపిస్తోంది. ఎరుపు రంగు పేపర్ తో ప్యాక్ చేసిన అమ్మాయిల ఫొటోలన్నింటినీ చూపిస్తూ ఈ వీడియో రూపొందించడం విశేషం. ఈ ఫొటోలన్నీ ఆమె భర్త ఇన్ స్టాగ్రామ్ లో లైక్ చేసిన అమ్మాయిల ఫొటోలు. వాటిని ప్రింట్ అవుట్స్ తీసి అందంగా ప్యాక్ చేసి భర్తకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా ఇచ్చింది. గ్లోరియా దీనికి పెట్టిన క్యాప్షన్ అయితే అదిరిపోయేలా ఉంది.. “What did you get your man for Valentine's Day? ” అన్న క్యాప్షన్ తో ఆమె దీన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వెబ్ సైట్లలో వైరల్ గా మారింది.

ప్లకార్డుల్లా..
ఆ సదరు భార్య తన భర్తకు నచ్చిన అమ్మాయిలందరి ఫొటోల ప్రింట్ అవుట్ కాపీలను తెచ్చి.. కొన్నింటిని ప్యాక్ చేసింది. మరికొన్నింటిని ప్లకార్డుల్లా పేర్చింది. ఇలా చేసే సమయంలో తన భర్తకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నట్టు కామెంటరీ కూడా ఆమె చేస్తుండటం మరో హైలైట్. "అందరూ మీరు ప్రేమించిన వారికి నచ్చే గిఫ్టులను వాలెంటైన్స్ డే సందర్భంగా షేర్ చేస్తున్నారు.. నేను కూడా నా ఆలోచనను షేర్ చేస్తా"నంటూ ఆమె చేసిన పోస్ట్ భలే నవ్వు తెప్పిస్తుంది కూడా.

తనకు నచ్చుతుందనే హోప్..
17 సెకెండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఆమె తన భర్తకు ఇవ్వబోతున్న గిఫ్ట్ ను రివీల్ చేసే విధానం షాక్ ఇచ్చేలా ఉంది. ఫోటో షేరింగ్ ప్లాట్ ఫాం అయిన ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తకు బాగా నచ్చిన అమ్మాయిలందరి ఫొటోలను ఓ చిన్న బాక్స్ లో పెట్టి ఆమె ర్యాప్ చేశారు. అంతేకాదు.. తనకు నచ్చుతుందని భావిస్తున్నట్టు ఆమె ఝలక్ ఇవ్వటం కొసమెరుపు. ఈ వీడియో కింద చాలామంది ఇదేం గిఫ్టు అంటూ కామెంట్లు పెడుతుంటే.. ఇదేదో వింతగా ఉంది.. చాలా బాగుంది. నేను కూడా ఇలాంటిది ట్రై చేస్తాను. అంటూ కామెంట్లు పెట్టడం విశేషం.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Trending, Valentines Day 2021, VIRAL NEWS

తదుపరి వార్తలు