ఆ ఉద్యోగి త్వరలోనే రిటైర్ కాబోతున్నాడు. అతడి దగ్గర సెలవులు కూడా ఉన్నాయి. కానీ అతడు పని చేసే రవాణా సంస్థ మాత్రం అతడికి సెలవు ఇచ్చేందుకు నిరాకరించింది. భార్యను(Wife) ఆస్పత్రికి తీసుకెళ్లాలని సెలవు అడిగినా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి భార్య స్వయంగా తన భర్త పని చేసే సంస్థ ముందు నిరహార దీక్షకు(Protest) దిగింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అట్పాడిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలాస్ కదమ్ 33 ఏళ్లుగా ఎస్టీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 70 రోజుల తర్వాత పదవీ విరమణ(Retirement) చేయనున్నాడు. అతడికి 270 రోజుల సెలవులు మిగిలి ఉన్నాయి.
అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించేందుకు మార్చి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు కోసం మార్చి 6న తన పై అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ వాళ్లు సెలవు నిరాకరించారు. దీంతో వికాస్ భార్య నళిని కదమ్ డిపోలోని అధికారి వెలుపల తన మంచం ఉంచి నిరసన ప్రారంభించారు.
నిరసన సమాచారం అందిన వెంటనే సాంగ్లీ డివిజన్ కార్యాలయం అధికారులు అట్పాడి అగర్ వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్న మహిళను కలిశారు. ఆందోళన విరమించాలని కోరారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. దీని తర్వాత అధికారులు విలాస్ కదమ్ సెలవును ఆమోదించారు. ఆ తర్వాత అతని భార్య నిరసన విరమించుకుని తన ఇంటికి వెళ్లిపోయింది.
ఇదేంది సామి.. కర్రలతో దెబ్బలు తినడానికి పోటీ పడుతున్న అమ్మాయిలు.. ఎందుకంటే..
Weekend Marriage: వారానికి రెండు రోజులు మాత్రమే! వీకెండ్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా?
ఈ మొత్తం వ్యవహారంలో మరో విశేషం ఏమిటంటే.. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న విలాస్.. మరో 70 రోజుల్లో పదవీ విరమణ చేయనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయనకు సెలవు నిరాకరించేలా అధికారులు వ్యవహరిస్తుండటంతో.. అక్కడ మిగతా కింద స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు కార్మిక సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news